ASBL NSL Infratech

ద్విపద దేశీయ సంపదకు తెలంగాణే జన్మభూమి - సీఎం కేసీఆర్

ద్విపద దేశీయ సంపదకు తెలంగాణే జన్మభూమి - సీఎం కేసీఆర్

ప్రపంచ తెలుగు మహాసభలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ తెలుగు సాహిత్య ప్రక్రియకు తెలంగాణే ఆదిగా నిలిచిందని ద్విపద దేశీయ సంపదకు తెలంగాణే జన్మభూమి అని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. తెలంగాణ సాంస్కృతి కళావైభవాన్ని చాటిచెప్పేలా మహాసభలు కొనసాగుతాయని సీఎం తెలిపారు. స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు  డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని, అందుకోసం రూ.50 కోట్లు నిధులు మంజూరు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు.

శుక్రవారం శాసనసభలో తెలుగు మహాసభలపై సీఎం ప్రకటన చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా తోరణాలు, ద్వారాలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తెలుగు భాషా ప్రియులను సభలకు ఆహ్వానిస్తామన్నారు. సన్నాహక సమావేశాల కోసం జిల్లాకో రూ.5 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. ముగింపు వేడుకల్లో పాల్గొనడానికి జాతీయ ప్రముఖులు రాబోతున్నారన్నారు. అతిథి మర్యాదల్లో తెలంగాణ వైభవాన్ని చాటేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

Tags :