ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నంద్యాలలో ఆ సంప్రదాయాన్ని విపక్షం పాటించడం లేదు : చంద్రబాబు

నంద్యాలలో ఆ సంప్రదాయాన్ని విపక్షం పాటించడం లేదు : చంద్రబాబు

ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే వారసులకు టికెట్‌ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని, కానీ విపక్షమైన వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ నంద్యాల అభివృద్ధి కోసమే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వచ్చారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని పదేపదే కోరారని అన్నారు. అభివృద్ధిపై మా చిత్తశుద్ధిని చూపాలనే నంద్యాలపై దృష్టిపెట్టామని అన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని ప్రకటించారు. రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమ చేయడంతోపాటు నంద్యాల పట్టణం రూపురేఖలు మారుస్తామని అన్నారు. నంద్యాల కేంద్రంగా మెగా సీడ్‌ పార్క్‌ తీసుకొస్తామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజలు సహకరించడం వల్లే విశాఖను అభివృద్ధి చేయగలిగామని, నంద్యాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, రోడ్ల విస్తరణ పనులకు ప్రజలు సహకరించడం సంతోషమని, కేటగిరీల వారీగా బాధితులకు పరిహారం అందిస్తామనిన అన్నారు.

నంద్యాలలో మురుగునీరు శుద్ధికి రూ.90 కోట్లు మంజూరు చేశామని అన్నారు. నంద్యాలలో రేపటి నుంచి 13 వేల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. నంద్యాలకు మైనార్టీ బాలికల రెసిడెన్షియల్‌ కాలేజీ మంజూరు చేయనున్నామన్నారు. త్వరలోనే అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల కోసం అభివృద్ధి పనులు చేయడం లేదని పేర్కొన్నారు. హేతుబద్ధతలేని విభజనతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, ఆర్థికలోటు ఉన్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి  చేస్తున్నామని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని ప్రకటించారు.

Tags :