ASBL NSL Infratech

నాడు సైబరాబాద్ నిర్మాణం, ఐటీ అభివృద్ధి : సీఎం

నాడు సైబరాబాద్ నిర్మాణం, ఐటీ అభివృద్ధి : సీఎం

ఏ కాలానికి తగినట్లుగా ఈ కాలంలో నిర్ణయాలు తీసుకుంటేనే సత్ఫలితాలను సాధించవచ్చని, నాడు తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని దూరదృష్టితో ఆలోచన చేశానని అన్నారు. జంటనగరాలుగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్, సికిందరాబాద్ సరసన సైబరాబాద్ నిర్మించానని అన్నారు. నాడు తాను కష్టపడటం వల్ల హైదరాబాద్‌కు ఐటీ దిగ్గజ కంపెనీలు వచ్చాయన్నారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో 33 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే తమ హయాంలో 300కు పైగా ఇంజీనీరింగ్ కాలేజీలు వచ్చాయని, హైదరాబాద్ చుట్టుపక్కలే 200 కాలేజీలు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి ఇచ్చిన ప్రాధాన్యతతో లక్షలాది ఉద్యోగావకాశాలు లభించిన అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

శంషాబాద్‌లో ప్రపంచ స్థాయి విమానాశ్రయం, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తన హయంలోనే వచ్చాయని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాలల రాక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవడంతోనే ఐటీ రంగానికి సైబరాబాద్‌లో ఊపు వచ్చిందన్నారు. ఐటీ దిగ్గజ సంస్థలకు సైబరాబాద్ గమ్యస్థానంగా మార్చామన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తమ రాష్ట్రం వారేనన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, రాష్ట్రం రెండుగా విడిపోయిందని, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిత రాజధానిగా అమరావతిని నిర్మించుకుంటున్నట్లు వివరించారు. నాలెడ్జ్ స్టేట్ గా రాష్ట్రానికున్న పేరును నిలబెట్టుకుంటూనే నాలెడ్జ్ ఎకానమీ వైపు దృష్టి సారించామని అన్నారు.

Tags :