ASBL NSL Infratech

ఎపి అభివృద్ధికి మీ తోడ్పాటు అవసరం

ఎపి అభివృద్ధికి మీ తోడ్పాటు అవసరం

సీఐఐ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

తమది పసిపాపలా సాకాల్సిన నూతన రాష్ట్రమని, రాజధాని అమరావతిని కూడా నిర్మించుకోవాల్సి ఉందని, అందువల్ల మీరు తోడ్పాటు అందిస్తే మా రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుందని, మీ సహకారం మాకు ఇప్పుడు చాలా అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  బుధవారం దావోస్‌లో జరిగిన సీఐఐ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ అందరి సహకారం ఉంటే మేం నిర్దేశించుకున్న వృవ ద్ధి రేటు లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సైబరాబాద్‌ నిర్మించిన అనుభవం తనకుందని, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సవాళ్లు - ఉన్న అవకాశాలు విభిన్నమని చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం ఐటి రంగాన్ని ప్రోత్సహించి సైబరాబాద్‌, హైటెక్‌ సిటీ నిర్మించానని, అప్పట్లో కొద్దిమంది వ్యాపారవేత్తలు, ఉన్నతవర్గాలకు మాత్రమే పరిమితమైన టెక్నాలజీ ప్రస్తుతం అంతటా విస్తరించిందని అన్నారు.

ఏపీని అతిపెద్ద లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, తద్వారా దక్షిణాసియాకు ముఖద్వారంగా ఏపీ మారనుందని ముఖ్యమంత్రి చెప్పారు. గతంలో విద్యుత్‌ రంగ సంస్కరణలు ప్రవేశ పెట్టామని, ఈ దఫా రెండోతరం విద్యుత్‌ సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. విద్యుత్‌ను చవకగా అందించే విధానాలపై ద ష్టి కేంద్రీకరించామని తెలిపారు. విద్యుత్‌ నిల్వ సామర్ధ్యం సమకూర్చుకునే సాంకేతికత మీద దష్టి సారించామని ముఖ్యమంత్రి అన్నారు.

మాకు అపరిమితమైన సౌర ఇంధన వనరులు అందుబాటులో ఉందని, మా రాష్ట్రాన్ని 'సూర్యోదయ ఆంధ్రప్రదేశ్‌'గా పిలుస్తామని చెప్పారు. సౌరశక్తిని సమర్ధంగా వినియోగించుకోగలిగితే అత్యంత చవకగా విద్యుత్‌ లభిస్తుందన్నారు.

అమరావతిని ప్రపంచంలోని ఉత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి పట్టణీకరణ సవాళ్లకు సమాధానంగా హరిత, జల నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రెండంకెల వృద్ధి రేటుతో ముందుకెళ్తున్నామని, పదిహేనేళ్లపాటు 20శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఏపీని నాలెడ్జి హబ్‌గా, ఇన్నోవేషన్‌ సెంటర్‌గా మార్చాలనేదే తమ ధ్యేయమని చెప్పారు. సీఐఐతో తనకున్న సుదీర్ఘమైన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి, ఏపీలో ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఐఐని ఆహ్వానించినట్టు తెలిపారు.

Tags :