ASBL NSL Infratech

దీపావళి వెలుగుల్లో మెరిసిన బాటా

దీపావళి వెలుగుల్లో మెరిసిన బాటా

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ నవంబర్‌ 4వ తేదీన శాంతాక్లారా కన్వెన్షన్‌ సెంటర్‌ థియేటర్‌లో నిర్వహించిన దీపావళి వేడుకలు బే ఏరియా వాసులు మరిచిపోలేని వేడుకగా నిలిచింది. వేడుకల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 వరకు జరిగిన ఈ వేడుకల్లో ఎన్నో కార్యక్రమాలను బాటావారు ప్రదర్శించారు.

యు స్మైల్‌ డెంటల్‌ ఈ కార్యక్రమాన్ని సమర్పించింది. గ్రాండ్‌ స్పాన్సర్‌గా పిఎన్‌జి జ్యూవెల్లర్స్‌ వ్యవహరించింది. రియల్టర్‌ రమణారెడ్డి (కాల్‌ హోమ్స్‌), పాఠశాల (తెలుగు స్కూల్‌), రియల్టర్‌ మను ఛంగోత్ర, క్లాసిక్‌ డైమండ్స్‌, రియల్టర్‌ లావణ్య దువ్వి, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఈ వేడుకలను స్పాన్సర్‌ చేశాయి. విరిజల్లు, బాలీ 92.3, తెలుగు టైమ్స్‌ మీడియా పార్టనర్‌లుగా వ్యవహరించాయి.

వేడుకలను పురస్కరించుకుని వేదికను దీపావళి దివ్వెలతో పువ్వులతో అందంగా అలంకరించారు. బాటా సలహాదారు విజయ ఆసూరి తొలుత అతిధులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో హైలైట్‌గా ఎన్నో కార్యక్రమాలు నిలిచాయి. చిన్నారులు ప్రదర్శించిన బూచాడమ్మ బూచాడు, రాధా మాధవీయం, పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన బాహుబలి నాటిక అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. బాటా యూత్‌ ప్రదర్శించిన సీతే మార్‌ ఉర్రూతలూగిస్తే, పరంపర ఫ్యాషన్‌షో అహా అనిపించింది.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారి కాన్సల్‌ కె. వెంకట రమణ, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి, టాలీవుడ్‌ నటుడు రవివర్మ, టాలీవుడ్‌ గాయని సాహితీ ఈ వేడుకలకు ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. అతిధులంతా దీపావళి శుభాకాంక్షలను తెలియజేస్తూ, బాటా ఈ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. గాయని సాహితీ మాట్లాడుతూ, బాటా స్టేజిపై పాట పాడటాన్ని తాను గర్వంగా భావిస్తున్నట్లు చెప్పింది.

ఈ సందర్భంగా హిట్టయిన పాటలను ఆమె పాడిండి. బాటా ప్రెసిడెంట్‌ శిరీష బత్తుల ఈ వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలను తెలియజేసింది. ఈ సందర్భంగా బాటా టీమ్‌ను ఆమె అందరికీ పరిచయం చేసింది. యశ్వంత్‌ కుదరవల్లి (వైస్‌ ప్రెసిడెంట్‌), సుమంత్‌ పుసులూరి (సెక్రటరీ), హరినాథ్‌ చికోటి (ట్రెజరర్‌), కొండల్‌రావు (జాయింట్‌ సెక్రటరీ), స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్‌ మల్ల, కళ్యాణ్‌ కట్టమూరి, కల్చరల్‌ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, లాజిస్టిక్‌ టీమ్‌ సభ్యులు ప్రశాంత్‌ చింత, అరుణ్‌ రెడ్డి, వరుణ్‌ ముక్కలను పరిచయం చేశారు. బాటా అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేశ్‌ కొండ వేడుకలు విజయవంతం అవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చివరన బాటా టీమ్‌ స్పాన్సర్లను మెమోంటోలతో సత్కరించింది.

Click here for Event Gallery

 

Tags :