ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అయుత చండీయాగం సక్సెస్

అయుత చండీయాగం సక్సెస్

అయుత చండీయాగాన్ని విజయవంతం చేసినవారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు.  గత అయిదు రోజులుగా ప్రపంచ శాంతికి  కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన అయుత చండీయాగం విజయవంతం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అనేక మంది స్వచ్చందంగా సహకరించారని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న పోలీసు, ఫైర్‌, రెవెన్యూ శాఖలకు చెందిన సిబ్బందితో పాటు టి.ఆర్‌.ఎస్‌. పార్టీ కార్యకర్తలకు, కేసీఆర్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్‌.పి.లు భక్తులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చేయడంలో కృతకృత్యులయ్యారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా భారత రాష్ట్రపతి, మూడు రాష్ట్రాల గరవ్నర్లు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ఎ.పి. మంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు పాల్గొన్నారని పేర్కొన్నారు.

Tags :