ASBL NSL Infratech

కడ్తాల్‌లో ఆటా వేడుకలు... పాఠశాలకు సహాయం

కడ్తాల్‌లో ఆటా వేడుకలు... పాఠశాలకు సహాయం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఆటా వేడుకలు కార్యక్రమాల్లో భాగంగా కడ్తాల్‌లోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆటా 2023 వేడుకలను ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆటా ప్రతినిధి గూడూరు కిషోర్‌ రెడ్డి ఆద్వర్యంలో సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆటా  ప్రతినిధులు రామకృష్ణ ఆలే, సతీష్‌, నర్సింహరెడ్డి, సూదిని సాయి, పరమేశ్వర్‌, మిమిక్రీ రమేశ్‌లు పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేడుకలు కొనసాగాయి.

కడ్తాల మండల కేంద్రంలో హైదరాబాద్‌`శ్రీశైలం జాతీయ రహదారిపై వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణ కోసం ఆటా సభ్యులు రూ.లక్షతో భారీకేడ్లను సమకూర్చారు. ఆటా ప్రతినిధులు, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌, వైస్‌ ఎంపీపీ బావండ్ల పల్లి ఆనంద్‌, సర్పంచ్‌ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి, ఎంపీటీసీ గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, సీఐ శివప్రసాద్‌, ఎస్‌ఐ హరిశంకర్‌ గౌడ్‌ లతో కలిసి నారాయణరెడ్డి దీనిని ప్రారంభించారు. జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల, ప్రాథమిక ప్రాథమికోన్నత, కస్తూర్బా గాంధీ పాఠశాలలకు రూ.లక్ష విలువ చేఐసే మైక్‌ సెట్లు, బ్యాండ్‌ సెట్‌లను స్కూల్‌ బ్యాగ్‌ లను ఆటా ప్రతినిధులు ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ ప్రవాస భారతీయులు జన్మభూమి రుణం తీర్చుకునేందుకు గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు నందించాలన్నారు. సొంత గ్రామమైన కడ్తాలలో ఎన్‌ఆర్‌ఐ గూడూరు కిషన్‌ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను కసిరెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఇతరులు హాజరయ్యారు. 

 

 

Tags :