ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

17వ ఆటా మహాసభలకు కేటీఆర్ ను ఆహ్వానించిన ఆటా నాయకులు

17వ ఆటా మహాసభలకు కేటీఆర్ ను ఆహ్వానించిన ఆటా నాయకులు

అమెరికా రాజధాని నగరం నడిబొడ్దున వాషింగ్టన్‌ డి సి లో మూడు రోజులపాటు జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న 17వ మహాసభలకు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆటా నాయకులు ఆహ్వానించారు. బోస్టన్‌ నగరంలో కేటీఆర్‌ను కలిసిన ఆటా నాయకులు ఈ మహాసభలకు దాదాపు 10,000 మందికిపైగా తెలుగువాళ్ళు హాజరవుతున్నారని, ఈ మహాసభలను నభూతో నభవిష్యతి అన్నట్లుగా పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆటా మహాసభలకు వచ్చేందుకు మంత్రి కేటీఆర్‌ సమ్మతించారు.

అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షులు భువనేష్‌ బుజాల, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారు, ట్రస్ట్‌ బోర్ద్‌ సభ్యులు సోమశేఖర్‌ నార్ల, కాన్ఫరెన్స్‌ కోర్‌ కమిటీ చైర్‌ హనిమి వేమిరెడ్డి, మల్ల యానాల రీజనల్‌ డైరెక్టర్‌, అనిత రెడ్డి, శశికాంత్‌ పసునూరు, రాజేందర్‌ కలవ, రమేష్‌ నల్లవోలు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా భువనేశ్‌ బూజాల మాట్లాడుతూ అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో అమెరికాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలు మరియు ఆటా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మై స్కూల్‌ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం ద్వారా భారతదేశంలో పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. అమెరికాలో విద్యార్థి యూత్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లను కూడా భువనేష్‌ బూజాల వివరించారు. మంత్రి కే తారకరామారావు ఆటా నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలకు హర్షం వ్యక్తం చేస్తు మరియు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు అండగా ఉంటుందని అన్నారు.  ఈ సమావేశంలో ఐటి ప్రిన్సిపల్‌ సెక్రెటరి జయేశ్‌ రంజన్‌ మరియు వ్యాపారవేత్త కార్తీక్‌ పొల్సాని కూడా పాల్గోన్నారు. ఈ సమావేశాన్ని ఈశ్వర్‌ బండ ఆటా బోస్టన్‌ టీం తో కలిసి నిర్వహించటానికి సహకరించారు.

 

Click here for Photogallery

 

Tags :