ASBL NSL Infratech

కేసీఆర్ ను ఆహ్వానించిన ఆటా & టాటా

కేసీఆర్ ను ఆహ్వానించిన ఆటా & టాటా

అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) కలిసి సంయుక్తంగా మే 31 నుంచి డల్లాస్‌లోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్‌ సదస్సుకు హాజరు కావల్సిందిగా తెలంగాణా ముఖ్యమంత్రి కేే. చంద్రశేఖర్‌రావుకు ఆటా అధ్యక్షుడు ఆసిరెడ్డి కరుణాకార్‌ నేత త్వంలోని బందం

ఆహ్వానాన్ని అందించింది. అమెరికాలోని తెలుగువారి అభ్యున్నతికి తోడ్పడుతున్న ఆటా సంస్థ సేవలను ఈ సందర్భంగా కేసీఆర్‌ కొనియాడారు. తరువాత ఆటా సభ్యులు మహారాష్ట్ర గవర్నర్‌ చండ్ర విద్యాసాగరరావు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితలను కూడా కలుసుకుని కన్వెన్షన్‌కు రావాల్సిందిగా కోరారు. ఆహ్వానాలను అందించిన వారిలో ఆటా డైరక్టర్ల బోర్డు సభ్యుడు బూజాల భువనేష్‌, తిరుపతి శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

 

Tags :