ASBL NSL Infratech

ఆస్టిన్‌లొ ఆటా 2024 కన్వెన్షన్ కికాఫ్ ఈవెంట్ ఘనవిజయం

ఆస్టిన్‌లొ ఆటా 2024 కన్వెన్షన్ కికాఫ్ ఈవెంట్ ఘనవిజయం

ఆటా (అమెరికన్ తెలుగు సంఘం)18వ కన్వెన్షన్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఆస్టిన్‌లో ఘనంగా జరిగింది. ఆటా 2024 కన్వెన్షన్ జూన్ 7 నుంచి9 వరకు అట్లాంటాలో జరగనుంది. ఈ వేడుకలో భాగంగా పలు కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. ఆస్టిన్ వేదికగా జరిగిన కికాఫ్ ఈవెంట్‌లో ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం, జాతీయ కోఆర్డినేటర్ సాయి సుదిని, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ ఏర్పాట్ల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఆటా బృందంలోని నర్సిరెడ్డి గడ్డికొప్పుల, వెంకట్ మంతెన, ఆర్డీ సంగమేశ్వర్ రెడ్డి రెడ్డిగారి, ఆర్సీలు శ్రీనివాస్ రెడ్డి వెదెదె, షీతల్ గంపావర్, ప్రవీణ్ చక్క, రాజ్ సంగిరెడ్డి, రాజశేఖర్ బెరికిటొల్లు ఎంతో కృషి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆటా ఇంత గొప్పగా ఎదగడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆటాలో సభ్యులైన మహిళలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు నిర్వహిస్తామని, వాటన్నింటినీ కూడా ఇలాగే విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరారు. మరిన్ని వివరాల కోసం www.ataconference.org వెబ్‌సైటును సందర్శించాలని ఆటా తెలిపింది.

 

 

Tags :