ASBL NSL Infratech

కాన్ఫరెన్స్ కు వస్తున్న సినీ తారలు

కాన్ఫరెన్స్ కు వస్తున్న సినీ తారలు

అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్‌ పేరుతో అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) నిర్వహిస్తున్న మహాసభలకు ఎంతోమంది సినీ కళాకారులు హాజరవుతున్నారు. డల్లాస్‌లోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు ఎంతోమంది హీరోలను, హీరోయిన్‌లను, కమెడియన్లను, గాయనీ గాయకులను, డైరెక్టర్‌లు యాంకర్లను ఆహ్వానించారు.

రవితేజ, జగపతిబాబు, సునీల్‌, నిఖిల్‌ సిద్ధార్థ్‌, సుధీర్‌ బాబు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వంటి హీరోలను వేడుకలకు ఆహ్వానించారు. హీరోయిన్‌లు త్రిషా కృష్ణన్‌, ఆదితిరావు హైదరి, హెబ్బా పటేల్‌, హంసా నందిని, దీక్షాపంత్‌, విమలా రామన్‌, హిమజ, ప్రియాంక, నీల్యా, తేజస్విని, కత్తి కార్తిక, కారుణ్య రామ్‌, నిఖిత నారాయణ్‌ వస్తున్నారు. వేణు, ధన్‌రాజ్‌, చమ్మక్‌ చంద్ర వంటి వారు కామెడిని ఈ సభల్లో పండించనున్నారు. ఈ సభల్లో తమ గానంతో ఆకట్టుకునేందుకు మంగ్లీ, గోండు రవి, శ్రీవాణి వంటి వారు వస్తున్నారు. సినీ దర్శకులు సందీప్‌ రెడ్డి, వి.ఎన్‌. ఆదిత్య, శ్రీనువైట్ల, ఎన్‌. శంకర్‌, ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు కూడా మహాసభలకు హాజరవుతున్నారు. సుమ కనకాల, చిత్రలేఖ కార్యక్రమాలను వీనులవిందుగా సమర్పించనున్నారు.

 

Tags :