ASBL NSL Infratech

కన్వెన్షన్ లో ఆకట్టుకున్న స్వాగత నృత్యం

కన్వెన్షన్ లో ఆకట్టుకున్న స్వాగత నృత్యం

ఆటా-టాటా కలిసి సంయుక్తంగా ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న వేడుకల్లో కన్వెన్షన్‌ సభల స్వాగత నృత్యానికి గేయరచన చేసిన ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆటా-టాటా వంటి సంస్థలను కలిసిమెలిసి చేస్తున్న సేవలను, కార్యక్రమాలను నిదర్శనంగా తీసుకుని పని చేయాలని కోరారు. డా. కలవడగుంట సుధ ఆధ్వర్యంలో దాదాపు 120 మంది చిన్నారులు స్వాగత నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.

సినీనటుడు సుధీర్‌ బాబు మాట్లాడుతూ, ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. తన కొత్త చిత్రం 'సమ్మోహనం'ను అందరూ ఆదరించాలని కోరారు. ఒబామా హయాంలో బెలీజ్‌ దేశానికి అమెరికా రాయబారిగా పనిచేసిన వినయ్‌ తుమ్మలపల్లి మాట్లాడుతూ, ఇండో - అమెరికన్‌లను రాజకీయాల్లో ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తాను 'ఇంపాక్ట్‌' అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 

Tags :