ASBL NSL Infratech

ఆటా కన్వెన్షన్‌ 2024 వివిధ పోటీలు... కార్యక్రమాలు

ఆటా కన్వెన్షన్‌ 2024 వివిధ పోటీలు... కార్యక్రమాలు

అమెరికాలోని తెలుగు సంస్థలు మన సంస్కృతి, సాంప్రదాయం, సాహిత్యం, అవగాహన సదస్సులు, సేవ, సహాయ కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందు ఉంటాయి. 1990లో మొదలైన అమెరికా తెలుగు సంఘం ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) 34 సంవత్సరాలుగా తెలుగు వారికి అన్ని విషయాలలో వెన్నుదన్నుగా ఉంటూ, సేవా సహాయ కార్యక్రమాలతో అప్రతిహతంగా ముందుకు సాగిపోతోంది. ఆటా అసోసియేషన్‌ అమెరికాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, కొనసాగిస్తోంది.

అమెరికాలోని జాతీయ తెలుగు సంఘాలు 2 సంవత్సరాలకు ఒకసారి భారీగా కన్వెన్షన్‌ నిర్వహిస్తూ ఉంటాయి. అందులో ఆట, మాట, పాటల పోటీలు, పెజంట్లు, మ్యూజికల్‌ కాన్సర్ట్లు, సదస్సులు ఇంకా ఎన్నో కార్యక్రమాలు, పోటీలు మరెన్నో ఉంటాయి. ఆటా కన్వెన్షన్‌ 2024 ఈ సారి అట్లాంటాలో జూన్‌ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా, సర్వ జనులకు ఉపయుక్తంగా జరగబోతున్నది. పోయిన సంవత్సరం నుండే మొదలైన ఏర్పాట్లు, ఇప్పుడు మరింత జోరందుకున్నాయి.

ఎన్నో ప్రాంతాలలో ఫండ్‌ రైజింగ్‌, కిక్‌ ఆఫ్‌ మీటింగులు జరిగాయి. అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్‌ కిరణ్‌ పాశం నాయకత్వంలో కోర్‌ కమిటీ శ్రీధర్‌ తిరుపతి, డైరెక్టర్‌ అనిల్‌ బొద్దిరెడ్డి, నేషనల్‌ కోఆర్డినేటర్‌ సాయి సూదిని, కో కన్వీనర్‌ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్‌ ప్రశీల్‌ గూకంటి, కో డైరెక్టర్‌ శ్రీనివాస్‌ శ్రీరామ ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలలో 300 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంతంగా పాటు పడుతున్నారు. వీరందరూ వారానికి ఒక్కసారి ఇన్‌ పర్సన్‌ మరియు ఆన్లైన్‌ మీటింగుల ద్వారా కలుస్తూ, గతిని, ప్రగతిని పరిశీలిస్తూ, సూచనలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు,  ఆటా వారి సిగ్నేచర్‌ పోటీలు చాలా ఉన్నాయి. కొన్ని డైరెక్టుగా కన్వెన్షన్‌ లో ఉంటాయి, కొన్ని వివిధ నగరాలలో నిర్వహించి, ఫైనల్స్‌ కన్వెన్షన్‌ అప్పుడు జరుగుతాయి.  

ఉత్సాహవంతులైన గాయనీ గాయకులకు అత్యంత ప్రోత్సాహకరంగా నువ్వా నేనా అన్నట్టు సాగే ‘రaుమ్మంది నాదం’ పాటల పోటీలు పలు నగరాలలో నిర్వహిస్తున్నారు.  

సయ్యంటే సై అన్నట్టుగా సాగే ‘సయ్యంది పాదం’ సరే సరి. కాలు కడుపుదాం, ప్రైజ్‌ గెలుద్దాం అనుకుంటున్నారా, ఇకనేం, నమోదు చేసుకోండి. ఎన్నో అమెరికన్‌ సిటీస్‌ లో జరుగుతుంది. వనితలకు, మగవారికి, యువతకు ఆత్మ విశ్వాసాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చే బ్యూటీ పెజంట్‌ కూడా చాలా చోట్ల నిర్వహించనున్నారు.  దీంతోపాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలను మహాసభల్లో ఏర్పాటు చేయనున్నారు.  చాలామంది వేసవి సెలవల్లో ఇండియా వెళుతూ ఉంటారు. ఆటా కన్వెన్షన్‌ వల్ల ఎంతో మంది జూన్‌ 2వ వారం లేక ఆ తర్వాత వెళ్లేట్లుగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మీరు కూడా ఈ గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోండి, విజ్ఞాన వినోదాలలో భాగంకండని నిర్వాహకులు కోరారు.  

అట్లాంటాలో ఏప్రిల్‌ 14న

ఆటా మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన సయ్యంది పాదం పోటీల్లో భాగంగా వివిధ నగరాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ 14న అట్లాంటాలో ఈ సయ్యంది పాదం పోటీలు జరగనున్నది. సోలో, గ్రూపు డ్యాన్స్‌ పోటీలను జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో నిర్వహిస్తున్నారు. జూనియర్స్‌ విభాగంలో పాల్గొనేవారి వయస్సు 7 నుంచి 13 వరకు వయస్సు ఉండాలి. సీనియర్స్‌ విభాగంలో పాల్గొనేవారి వయస్సు 14  సంవత్సరాలకు పైగా ఉండాలి. ఈ పోటీలకు చైర్‌గా శ్రీ శ్రుృతి చిట్టూరి, అడ్వయిజర్‌గా రాజ్‌ కక్కెర్ల వ్యవహరిస్తున్నారు. ఫైనల్‌ విన్నర్స్‌ను ఆటా టైటిల్‌ తో సత్కరించనున్నారు. అలాగే సెలబ్రిటీల ద్వారా వారికి సత్కారం చేస్తారు. ఈ సయ్యందిపాదం కమిటీలో కో చైర్‌గా వాణి గడ్డం, లావణ్య నూకల, బిందు మనుసాని, మెంబర్లుగా రజనీకాంత్‌ దాడి, చిట్టి ఆడబాల, గౌరి కారుమంచి ఉన్నారు.

అందాల పోటీలు

మహాసభల కార్యక్రమాల్లో భాగంగా  ఆటా పేజియంట్‌ 2024 పేరుతో అందాల పోటీలను ఆటా ఏర్పాటు చేసింది. మిస్‌ టీన్‌ ఆటా, మిస్‌ ఆటా, మిస్టర్‌ టీన్‌ ఆటా, మిస్టర్‌ ఆటా, మిసెస్‌ ఆటా కేటగిరీలలో పోటీలను నిర్వహిస్తున్నారు. మిస్‌ టీన్‌ ఆటా పోటీల్లో పాల్గొనేవారు 13 నుంచి 19 వయస్సు లోపు ఉండాలి. మిస్‌ ఆటా పోటీల్లో పాల్గొనేవారి వయస్సు 20 సంవత్సరాలు పైన ఉండాలి. అవివాహితులై ఉండాలి. మిస్టర్‌ టీన్‌ ఆటా పోటీల్లో పాల్గొనేవారు 13 నుంచి 19 వయస్సుకలవారై ఉండాలి. మిస్టర్‌ ఆటా పోటీల్లో పాల్గొనేవారు 20 సంవత్సరాలు పైన ఉండాలి. మిసెస్‌ ఆటా పోటీల్లో పాల్గొనేవారు 18 సంవత్సరాలుపైన ఉండాలి. ఈ పోటీలకు చైర్‌గా శ్రావణి రాచకుళ్ళ, అడ్వయిజర్‌గా నీహారిక నావల్గ వ్యవహరిస్తున్నారు. పోటీల్లో పాల్గొనాలనుకునేవారు మార్చి 31లోగా తమ పేర్లను రిజిష్టర్‌ చేసుకోవాలి. అంతిమ విజేతలను ఆటా టైటిల్‌తో సెలబ్రిటీస్‌ చేతులమీదుగా సత్కరిస్తారు. ఈ పోటీలకు కో చైర్‌ లుగా గాయత్రీ ఐలా, అనుజ గొల్ల, మెంబర్లుగా శ్వేత పీత, దీప్తి ఎల్గురి, విద్యా క్రాప, అర్చన కపూర్‌ వ్యవహరిస్తున్నారు.

జుమ్మందినాదం

మహాసభల కార్యక్రమాల్లో భాగంగా జుమ్మందినాదం పేరుతో పాటల పోటీలను ఆటా ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 13, 14 తేదీల్లో గ్రేటర్‌ అట్లాంటాలోని బంజారా బాంక్వెట్స్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగంలో ఈ పోటీలు జరుగుతాయి. జూనియర్స్‌ విభాగంలో పాల్గొనేవారి వయస్సు 7 నుంచి 14 వరకు వయస్సు ఉండాలి. సీనియర్స్‌ విభాగంలో పాల్గొనేవారి వయస్సు 15  సంవత్సరాలకు పైగా ఉండాలి.  ఫైనల్‌ విన్నర్స్‌ను ఆటా టైటిల్‌ తో సత్కరించనున్నారు. అలాగే సెలబ్రిటీల ద్వారా వారికి సత్కారం చేస్తారు. 

జుమ్మందినాదం కమిటీకి చైర్‌గా జనార్దన్‌ పన్నెల, కో చైర్‌లుగా శ్రీవల్లి శ్రీధర్‌, మౌనికా రెడ్డి చింతలస విజయ్‌ కుమార్‌ వింజామర, సభ్యులుగా రామారెడ్డి తేటలి, అరుణ్‌ కావటి, శివకిరణ్‌ లింగిశెట్టి, అడ్వయిజర్‌గా సత్య కర్నాటి ఉన్నారు. 

అట్లాంటా ప్రిలిమ్స్‌ కమిటీలో సందీప్‌ గుండ్ల, గణేశ్‌ కాసం, కిషన్‌ దేవునూరి, శ్రీ శ్రుతి చిట్టూరి, శ్వేత అర్నెపల్లి, ఉదయ ఈటూరు ఉన్నారు.

 

 

Tags :