ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

దేవ‌ర తెలుగు రాష్ట్రాల రైట్స్ అంతా?

దేవ‌ర తెలుగు రాష్ట్రాల రైట్స్ అంతా?

జూ. ఎన్టీఆర్- కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న దేవ‌ర సినిమా బిజినెస్ కు సంబంధించిన చ‌ర్చ‌లు అప్పుడే మొద‌లైపోయాయి. అక్టోబ‌ర్ 10న రిలీజ్ ఫిక్స్ అవ‌డంతో నిర్మాత‌లు థియేట్రిక‌ల్ డీల్స్ పై ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు క‌లిపి రూ. 120 కోట్ల‌తో మొద‌లుపెట్టి రూ.140 కోట్ల వ‌ర‌కు ఆశిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇంత భారీ రేటు చెప్తున్న‌ప్ప‌టికీ బ‌య్య‌ర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నార‌ట‌. ముఖ్యంగా మైత్రీ మూవీ మేక‌ర్స్, దిల్ రాజు, సితార ఎంట‌ర్టైన్మెంట్స్ లాంటి వారు ట్రై చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. హిందీలో ఇప్ప‌టికే క‌ర‌ణ్ జోహార్, అనిల్ తో అగ్రిమెంట్ అయిపోయింది కాబ‌ట్టి నార్త్ మార్కెట్ గురించి టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌న్లేదు. ఓటీటీ రైట్స్ ను ఇప్ప‌టికే నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనేసుకుంది. మ‌రో నెల రోజుల్లో శాటిలైట్ రైట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి.

ఇక థియేట్రిక‌ల్ బిజినెస్ ఒక్క‌టే పెండింగ్. ఇప్పుడు ఆశిస్తున్న రేట్ వ‌ర్క‌వుట్ అవాలంటే సినిమా భారీ హిట్ అవ‌డంతో పాటూ టికెట్స్ రేట్స్ కూడా పెర‌గాలి. దేవ‌ర టీజ‌ర్ ఇంకా రాలేదు. అనిరుధ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేక‌ర్స్ లిరిక‌ల్ వీడియోల‌ను చాలా స్పెష‌ల్ గా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ట్రైల‌ర్ ను నెక్ట్స్ లెవెల్ అనిపించేలా క‌ట్ చేస్తార‌ట‌. ఏప్రిల్ పోతే దేవ‌ర రిలీజ్ కు మ‌రో అయిదు నెల‌లు మాత్ర‌మే టైమ్ ఉంటుంది కాబ‌ట్టి మిగిలిన ప‌నుల్ని వేగ‌వంతం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :