Venkatesh: అందుకే పబ్లిసిటీని పట్టించుకోను
ఇండస్ట్రీలో ఉన్న వాళ్లెవరైనా పబ్లిసిటీని కోరుకోవడం చాలా కామన్. కానీ విక్టరీ వెంకటేష్(Venkatesh) మాత్రం పబ్లిసిటీకి వీలైనంత దూరంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే తన సక్సెస్ ను ఆయన ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినా ఎందుకమ్మా ఇదంతా అని సింపుల్ గా చెప్పేస్తుంటారు. అయితే వెంకీ(Venky) ఇలా పబ్లిసిటీకి దూరంగా ఉండటానికి గల కారణాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
రజినీకాంత్(Rajinikanth) ఇచ్చిన సలహా వల్లే తాను పబ్లిసిటీ విషయంలో అలా ఉంటున్నానని చెప్పారు. తనకు, రజినీకి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువని, ఆయన్నుంచి తానెన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పిన వెంకీ, తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రజినీ ఓ మాట చెప్పారని, ఆ మాటను అప్పట్నుంచి ఇప్పటివరకు తాను ఫాలో అవుతున్నట్టు చెప్పారు.
మూవీ రిలీజ్ టైమ్ లో బ్యానర్లు కట్టారా లేదా? మన ఫోటోలు పేపర్ లోని మొదటి పేజిలో పెద్ద పెద్ద యాడ్స్ వచ్చాయా లాంటి విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించద్దని, మన పని మనం చేసుకుంటూ వెళ్తే మిగిలిందంతా విధే చూసుకుంటుందని ఆయన చెప్పారని వెంకీ తెలిపారు. ఆయన చెప్పిన మాటల్ని ఫాలో అవడం వల్లే తాను పబ్లిసిటీ గురించి పట్టించుకోనని, అసలు దేని గురించీ తాను ఎక్కువగా ఆలోచించనని తెలిపారు వెంకీ.






