Samantha: రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లో మార్పు రాదు
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఓ వైపు నటిగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా మారింది. సమంత నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham) మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ శుభం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. శుభం ప్రమోషన్స్ లో భాగంగా సమంత నిర్మాతగా తాను తీసుకున్న రిస్క్ గురించి మాట్లాడింది.
15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండటం వల్ల సినిమాపై ప్రేమ, అభిరుచి పెరిగాయని, దాని వల్ల భయం పోయిందని, నిర్మాతగా ఉండటం రిస్క్ అయినా సరే రిస్క్ తీసుకోకపోతే మార్పు రాదని, అందుకే తానెప్పుడూ రిస్క్ తీసుకోవడానికి వెనుకాడనని సమంత తెలిపింది. తన బ్యానర్ కోసం మంచి టీమ్ వర్క్ చేస్తుందని, శుభం మూవీ కోసం తామంతా ఎంతో కష్టపడ్డామని సమంత చెప్పింది.
నటిగా ఉంటే సెట్స్ లో యాక్టింగ్ తప్ప పెద్దగా పనేం ఉండదని, కానీ నిర్మాతగా ఉన్నప్పుడూ ప్రతీదీ తెలుసుకుంటూ ఉండాలని, శుభం సినిమాతో తాను చాలా నేర్చుకున్నానని, ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలానే ఉందని సమంత చెప్పుకొచ్చింది. అయితే నిర్మాతగా తాను ఒక రకమైన సినిమాలకే కట్టుబడి లేనని, అన్ని జానర్లలో సినిమాలు తీసి ఆడియన్స్ ను అలరించాలనుకుంటున్నట్టు సమంత తెలిపింది.






