ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రైటర్ పద్మభూషణ్, మే28 ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!

రైటర్ పద్మభూషణ్, మే28 ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!

ఆసక్తికరమైన సీరియల్స్​, వినోదం పంచే రియాలిటీ షోలతో అలరిస్తున్న జీతెలుగు ఈ వీకెండ్​ని మరింత స్పెషల్​గా మార్చేందుకు మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతోంది. టాలీవుడ్​ యంగ్​ హీరో సుహాస్ మరియు టీనా శిల్పా రాజ్ జంటగా నటించిన రైటర్​ పద్మభూషణ్ సినిమాను ఈ వారం వరల్డ్​ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది. అద్భుతమైన కథ, కథనంతో బాక్సాఫీస్​ వద్ద మంచి సినిమాగా నిలిచిన సినిమా రైటర్​ పద్మభూషణ్. భావోద్వేగాల మిళితమైన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్​టైనర్ రైటర్​ పద్మభూషణ్​,​​ మే 28 ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!

ఈ సినిమాలో పద్మభూషణ్​గా సుహాస్​ నటించారు. పద్మభూషణ్​ తన మొదటి పుస్తకం తొలి అడుగును ప్రచురించి అందరిచేత గుర్తించబడాలని కోరుకుంటాడు. అనుకోకుండా ఓ పుస్తకం ద్వారా పద్మభూషణ్​ను అందరూ గొప్ప రచయితగా గుర్తించి అభినందిస్తారు. అయితే, అంతా అనుకున్నట్లు ఆ పుస్తకం రాసింది అతను కాదు. తన పేరుతో ఎవరు పుస్తకం రాశారో తెలుసుకోవాలనుకుంటాడు పద్మభూషణ్. ఇంతకీ ఆ రచయిత ఎవరు? వేరే రచయిత పద్మభూషణ్ పేరును ఎందుకు ఉపయోగించారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రైటర్​ పద్మభూషణ్​ సినిమా కామెడీ, సెంటిమెంట్​తో కూడిన సందేశాత్మక చిత్రం. సుహాస్​ నటన, కథలో ట్విస్ట్​ అందరి మనసునూ హత్తుకుంటుంది. క్లైమాక్స్​తో అందరినీ కట్టిపడేశాడు దర్శకుడు.  రైటర్​ పద్మభూషణ్ సినిమా ప్రతి ఒక్కరికీ తల్లిని మరియు ఆమె తమకోసం చేసిన త్యాగాలను గుర్తుచేస్తుంది. రైటర్​ అవ్వాలనే కొడుకు కల నెరవేరేందుకు తపన పడే తల్లిగా రోహిణి అందరిచేతా కంటతడి పెట్టిస్తారు.

ఈ సినిమాలో సుహాస్, టీనా శిల్ప రాజ్ హీరోహీరోయిన్లుగా నటించగా ఆశిష్ విద్యార్థి,  శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, గోపరాజు మరియు ప్రవీణ్ కటారియా సహాయక పాత్రల్లో నటించారు. కామెడీ, ఎమోషనల్​ ఫ్యామిలీ డ్రామా రైటర్​ పద్మభూషణ్​ ఈ ఆదివారం మీ జీ తెలుగులో!

కామెడీ అండ్​ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ రైటర్​ పద్మభూషణ్ - ఆదివారం 6 గంటలకు, జీ తెలుగులో మాత్రమే, తప్పక చూడండి!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :