ASBL NSL Infratech

అభిమాన ప్రేక్షకులకు జీ తెలుగు అందిస్తున్న డబుల్ ధమాకా!

అభిమాన ప్రేక్షకులకు జీ తెలుగు అందిస్తున్న డబుల్ ధమాకా!

ఈ వారాంతం మీకోసం జీ తెలుగు అందిస్తున్న డబుల్​ ఆఫర్​!

ఈ ఏడాదిని సంక్రాంతి సంబరాలతో అట్టహాసంగా ప్రారంభించిన జీ తెలుగు ఈ వారాంతంలో తన అభిమాన ప్రేక్షకులకోసం మరిన్ని సర్​ప్రైజ్​లు ఇచ్చేందుకు సిద్ధమైంది.  వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతోపాటు పాపులర్​ నాన్​ఫిక్షన్​ షో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ​ ఫినాలేతో గ్రాండ్​గా 22 జనవరి 2023న మీ ముందుకు వస్తోంది జీ తెలుగు.

భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కి ప్రేక్షకులను అలరించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​గా ఈ ఆదివారం మీ ముందుకు రాబోతోంది. భిన్నమైన పాత్రలతో అభిమానులను అలరిస్తున్న హీరో  అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ మరియు శ్రీతేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం తెలుగు ఉపాధ్యాయుడు శ్రీపాద శ్రీనివాస్ (అల్లరి నరేష్), ఇంగ్లీష్ టీచర్ (వెన్నెల కిషోర్) చుట్టూ తిరుగుతుంది. ఎన్నికల విధుల్లో భాగంగా గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో 100 శాతం ఓటింగ్‌ సాధించాలని శ్రీపాద శ్రీనివాస్‌ లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే తమ కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం, ఎన్నికల వ్యవస్థపై గిరిజన సమాజానికి విశ్వాసం లేదని తెలుసుకుని తనవంతు ప్రయత్నంగా వారికి సాయపడేందుకు తన ఉద్యోగాన్ని సైతం ఫణంగా పెట్టి పాటుపడతాడు శ్రీనివాస్​.

A.R మోహన్, జీ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ నిర్మించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం గిరిజనుల వేదన మరియు దుస్థితిని ఉన్నది ఉన్నట్లుగా చూపించి ప్రేక్షకుల హృదయాలను కదిలించింది.  ఇది AP & తెలంగాణా అటవీ ప్రాంతంలో తెరకెక్కించిన సినిమా. ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనా  కథానాయకుడు - శ్రీపాద శ్రీనివాస్ దృఢ విశ్వాసంతో గిరిజన సమాజం ఆలోచనలను మార్చడం, వారికి సహాయం చేయడం సినిమాకు హైలెట్​గా నిలిచింది. శ్రీనివాస్​ తన లక్ష్యాన్ని సాధించడానికి ఏం చేశాడు? లచ్చిమి (ఆనంది) సహాయంతో గిరిజనులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి చేసిన ప్రయత్నాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతాయి. ఈ అద్భుతమైన చిత్రాన్ని జనవరి 22 సాయంత్రం 6 గంటలకు తప్పక చూడండి మీ జీ తెలుగులో!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ అనంతరం డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ​ తెలుగు గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది.  ఆగస్టు 22న జీ తెలుగులో ప్రారంభమైన  డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ​ -మొదటి సీజన్‌  ప్రారంభం నుంచీ అదిరిపోయే ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. AP మరియు తెలంగాణలో విశేష ఆదరణ పొందిన షోగా నిలిచింది. ప్రతిభావంతులైన జోడీలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అందించిన వేదికగా డ్యాన్స్​ ఇండియా డ్యాన్స్​ తెలుగు వారిని ఆకట్టుకుంటోంది. అయితే, 5 నెలల విజయవంతమైన ప్రయాణం తర్వాత, DID – తెలుగు ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది.

ఈ షోకి న్యాయనిర్ణేతలుగా సంగీత, బాబా భాస్కర్ మరియు ఆనంది వ్యవహరిస్తున్నారు. ఎనర్జిటిక్​ యాంకర్​ అకుల్ బాలాజీ, కామెడీ క్వీన్​ రోహిణి చేసే అల్లరి ప్రేక్షకులకు మరింత వినోదం పంచనుంది.  అక్కినేని నట వారసుడు హీరో - అఖిల్ అక్కినేని - DID తెలుగు గ్రాండ్ ఫినాలేలో ప్రేక్షకులను పలకరించనున్నారు. మెస్మరైజింగ్​ పర్​ఫామెన్స్​తోపాటు కామెడీని పంచనున్నాడు అఖిల్​! అంతేకాదు, ఈ ప్రత్యేక ఎపిసోడ్ నటి సంగీత సినీ పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమయ్యే ప్రత్యేక AV ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేయనుంది.

అబ్బు-–అక్షద, శరత్–-ఆయుషి, ప్రజ్వల్–-దక్షిత, మరియు చెర్రీ–-భూమిక మధ్య ఫైనల్​ హంగామా జరగనుంది. ఈ నాలుగు జోడీలు ట్రోఫీని సొంతం చేసుకోవడానికి తమ ఉత్తమ ప్రదర్శనలతో పోటీ పడనున్నాయి. ఫైనల్​లో ఈ నాలుగు జోడీలు అందించే అద్భుతమైన ప్రదర్శనలు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. అయితే డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ – తెలుగు మొదటి సీజన్‌ విజేత ఎవరు? తెలుసుకోవాలంటే..  జనవరి 22న రాత్రి 9 గంటలకు మీ  జీ తెలుగులో ప్రసారమయ్యే షోని మిస్సవకండి.

జనవరి 22న సాయంత్రం 6 గంటలకు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం,  రాత్రి 9 గంటలకు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్– తెలుగు గ్రాండ్ ఫినాలే చూసి ఈ వారాంతాన్ని మరింత స్పెషల్గా మలుచుకోండి మీ జీ తెలుగుతో!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :