వైస్సార్సీపీ సిద్ధం సభలకు అమెరికా NRI ల సంఘీభావం !
లాస్ ఏంజెల్స్ నగరం సమీపం లోని ఇర్విన్ పట్టణంలో గల YSRCP అభిమానులు సమావేశమై, ఎన్నికలకు వారం మాత్రమే ఉన్నందున, ఈ వారం రోజులలో చేయవలసిన కార్యక్రమాలపై చర్చించారు, ముఖ్యంగా YSRCP ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనుల గురించి సామాజిక మాధ్యమాలలో విస్తృతం గా ప్రచారం కల్పించాలని తీర్మానించారు.
వాస్తవానికి గత అన్ని ప్రభుత్వాలకంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించినప్పటికీ, ఆదాయ వనరులతో భావితరాల అభివృద్ధికి బాటలు పరిచినప్పటికీ, కేవలం సంక్షేమానికి సంబందించిన విషయాలు మాత్రమే ఎక్కువ ప్రచారం మరియు ప్రాచుర్యం పొందినందున, అభివృద్ధికి సంబంధించి మరింత అవగాహన కల్పించాలని తీర్మానించారు.
ఈ సందర్భంగా పలువురు NRI లు మాట్లాడుతూ, YSRCP తాను చేసిన పనులను చెప్పుకుంటూ, ఓట్లను అభ్యర్థిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం వారు గతంలో చేసిందేమీ లేక కేవలం తిట్లు, పరుషవాక్యాలతో ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఈ వ్యత్యాసం గ్రహించలేని అజ్ఞానులు ఏమాత్రం కాదని, అది ఎన్నికల ఫలితాలలో నిరూపించబడుతుంది అన్నారు.