MKOne Telugu Times Youtube Channel

తెలుగు రాష్ట్రాల పిల్లలకు సువర్ణావకాశం..జీ తెలుగు డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ మార్చి 30న, మన కర్నూలులో!

తెలుగు రాష్ట్రాల పిల్లలకు సువర్ణావకాశం..జీ తెలుగు డ్రామా జూనియర్స్  ఆడిషన్స్ మార్చి 30న, మన కర్నూలులో!

ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుండే జీ తెలుగు ఇప్పుడు డ్రామా జూనియర్స్  సరికొత్త సీజన్‌తో మీ ముందుకు వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల్లోని నటనా ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో డ్రామా జూనియర్స్ సీజన్ 6 ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్‌లను పూర్తి చేసుకున్న డ్రామా జూనియర్స్ మరో సీజన్​తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు ప్రతిభగల గాయనీ గాయకులనూ ఆడిషన్స్​కి ఆహ్వానిస్తోంది. - డ్రామా జూనియర్స్ సీజన్‌ 6 కోసం తెలుగు రాష్ట్రాల్లో నటనపై ఆసక్తిగల చిన్నారులతో పాటు సంగీతంపై మక్కువ గల వారికీ ఇదే చక్కని అవకాశం.

3 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఇదే సువర్ణావకాశం. మీ పిల్లలకు నటనపై ఆసక్తి ఉంటే తప్పకుండా ప్రోత్సహించి వారి భవిష్యత్తుకు బాటలు వేయండి. విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్తో పాటు సింగింగ్ షో కోసం  ఆన్గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహించనుంది. గాయకులుగా మారాలని కలలు కనే  అన్నివయస్సుల వారికీ అద్భుత అవకాశం అందిస్తోంది మీ జీ తెలుగు. మార్చి 30న  హోటల్ ఫ్రైమ్ల్యాండ్, కర్నూల్ రైల్వే స్టేషన్ కాంపౌండ్,  కర్నూల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆడిషన్‌లు నిర్వహించబడతాయి. ఏవైనా సందేహాలు ఉంటే 9154984009 నెంబర్​కి కాల్ చేయవచ్చు. ‌‌ తదుపరి వారాల్లో ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలోని ప్రముఖ నగరాలైన విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, ఖమ్మం, కరీంనగర్ మరియు హనుమకొండ నగరాల్లో కూడా ఆడిషన్లు నిర్వహించబడతాయి.

మట్టిలోని మాణిక్యాలను గుర్తించేందుకు మార్చి 30న కర్నూలు వచ్చేస్తోంది మీ జీ తెలుగు!

 

 

 

Tags :