ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎన్నారైలు కలిస్తే ఎపిలో వైకాపా గెలుపు ఖాయం : నాటా సభలో వైకాపా నేతలు

ఎన్నారైలు కలిస్తే ఎపిలో వైకాపా గెలుపు ఖాయం : నాటా సభలో వైకాపా నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి పాలన రావాలంటే ఎన్నారైలు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని నాటా 2023 సభల రెండోరోజు వేడుకల్లో ఏర్పాటు చేసిన వైకాపా సోషల్‌ మీడియా సమన్వయ సమావేశంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. ఏపీలో వైకాపా ప్రభుత్వ ఏర్పాటుకు, పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో వైకాపా అభ్యర్థులు గెలుపొందటానికి ప్రవాసులు కృషి చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బయ్యపు మధుసుదనరెడ్డి తదితరులు కోరారు. గత ఎన్నికల సమయంలో ప్రతి ప్రవాస కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేశారని, మరలా ఆ పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు.

వైకాపా సోషల్‌ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవరెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. కేంద్రీయ కార్యాలయం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా శ్రేణులతో కలిసి పనిచేయడం, సోషల్‌ మీడియా ఛానళ్లను ప్రభావవంతంగా వినియోగించుకోవడం, వైకాపాను ఆయా వేదికల ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు, ఓటర్లకు చేరువ చేసే విధివిధానాలు, ప్రణాళికలను ఆయన సభికులతో పంచుకున్నారు. కార్యక్రమంలో చిన్నా వాసుదేవరెడ్డి, కడప రత్నాకర్‌, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ భారీ ఫ్లెక్సీలను మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :