ASBL NSL Infratech

వాట్సాప్ శుభవార్త... ఇకపై వారికి

వాట్సాప్ శుభవార్త... ఇకపై వారికి

ఇన్‌స్టంట్‌ మెస్సేజింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీగా యూజర్లు ఉన్నారు. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ మోటా కంపెనీ పరిచయం చేస్తుంటుంది. ప్రస్తుతం పలువురు వాట్సాప్‌ స్టేటస్‌ని అప్‌డేట్‌ చేసుకోవడంలో కొంత ఇబ్బందులకు గురవుతున్న వారికి శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కంపెనీ కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నది. వాట్సాప్‌ వెబ్‌ వర్షన్‌ నుంచి సైతం వాట్సాప్‌ స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్‌ దశలో ఉన్నది. ప్రస్తుతం కేవలం మొబైల్‌లోనే స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ  ఫీచర్‌ వాట్సాప్‌ కంపానియన్‌ మోడ్‌లో ఓ భాగం ఇందులో యూజర్లు నాలుగు వేర్వేరు డివైజెస్‌లో ఒకే అకౌంట్‌ను లాగిన్‌ చేసుకునే వీలుంటుంది. స్టేటస్‌లో వాట్సాప్‌ వెబ్‌ నుంచి స్టేటస్‌లకు ఫొటోలు, వీడియోలు, టెక్స్‌ట్‌ను షేర్‌ చేసే అవకాశం వాట్సాప్‌ కల్పిస్తున్నది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :