ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రెండో స్థానానికి దూసుకుపోయిన వివేక్ రామస్వామి

రెండో స్థానానికి దూసుకుపోయిన వివేక్ రామస్వామి

భారత సంతతి అమెరికన్‌, రిపబ్లికన్‌ పార్టీ నేత వివేక్‌ రామస్వామి అధ్యక్ష ఎన్నికల రేసులో తన బలం పెంచుకుంటున్నారు. 13 శాతం మంది ఓటర్ల మద్దతుతో రిపబ్లికన్‌ పార్టీ తరపున ఆయన రెండవ స్థానానికి చేరుకున్నారు. భారత సంతతికే చెందిన నిక్కీ హేలీని ఆయన వెనుకకు నెట్టేశారు. అయినా ఇప్పటికీ రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల ప్రధాన అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ 39 శాతం మంది మద్దతులో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఇప్పటి వరకు రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థుల్లో రెండవ స్థానంలో ఉన్న ఫ్లోరిడా గవర్నర్‌ రోనా డిశాంటిస్‌ ఏకంగా ఐదవ స్థానానికి పడిపోయారు. 10 శాతం ఓట్ల మద్దతుకే పరిమితమయ్యారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :