'ఆహా'లో సరికొత్త ప్రోగ్రాం లో హోస్ట్‌గా వెంకటేష్?

'ఆహా'లో సరికొత్త ప్రోగ్రాం లో హోస్ట్‌గా వెంకటేష్?

ప్రస్తుతం 'ఆహా'లో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షోతో హ్యుజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న ఈ షోకి భారీ ఆదరణ వస్తుండటంతో.. అల్లు అరవింద్ మరో క్రేజీ ప్లాన్ చేశారట. 'ఆహా' కోసం ఓ సరికొత్త ఎంటర్‌టైనింగ్ ప్రోగ్రాం డిజైన్ చేపిస్తున్నారట. ఈ షో కోసం హోస్టుగా వెంకటేష్‌ని రంగంలోకి దించాలని స్కెచ్చేసిన ఆహా టీం ఇప్పటికే వెంకీమామతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. వెంకటేష్‌ని ఒప్పించేందుకు స్వయంగా అల్లు అరవింద్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఇన్‌సైడ్ టాక్.  'ఆహా' కోసం ఓ సరికొత్త ఎంటర్‌టైనింగ్ ప్రోగ్రాం డిజైన్ చేపిస్తున్నారట అల్లు అరవింద్. ఈ షో కోసం హోస్ట్‌గా సీనియర్ హీరో వెంకటేష్ బాధ్యతలు తీసుకోనున్నారని సమాచారం.

ఈ మధ్యకాలంలో సిల్వర్ స్క్రీన్ హీరో హీరోయిన్లు బుల్లితెర బాట పడుతుండటం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ స్టార్స్ మొదలుకొని అన్ని భాషల్లోని సినీ తారలు బుల్లితెర కార్యక్రమాలను హోస్ట్ చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, హీరోయిన్ సమంత లాంటి వారు బుల్లితెరపై తమ మార్క్ చూపించగా రీసెంట్‌గా నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంటరై సత్తా చాటుతున్నారు. ఇక ఇప్పుడు ఇదే ఫార్ములాతో మరో సీనియర్ హీరో వెంకటేష్ రంగంలోకి దిగుతున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వెంకటేష్ 'ఎఫ్ 3' మూవీలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్‌తో కలిసి చేస్తున్న ఈ ఫన్ రైడ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే రానాతో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్‌లో భాగమవుతున్నారు వెంకటేష్. మరి ఈ బిజీ షెడ్యూల్ నడుమ ఆహా హోస్ట్‌గా వెంకటేష్ అంగీకరిస్తారా? లేదా అనేది చూడాలి. మరోవైపు ఈ న్యూస్ బయటకు రాగానే వెంకీ ఫ్యాన్స్‌లో కుతూహలం నెలకొంది. వెంకీమామను హోస్ట్‌గా చూడాలని ఆశపడుతున్నారు దగ్గుబాటి అభిమానులు.

 

Tags :