ASBL NSL Infratech

స్టెప్స్ విషయంలో తగ్గేదేలే అంటున్న సీనియర్ స్టార్స్...

స్టెప్స్ విషయంలో తగ్గేదేలే అంటున్న సీనియర్ స్టార్స్...

సీనియ‌ర్ హీరోలు అరవైలోకి అడుగుపెడుతున్నా ఇప్ప‌టికీ ఏ మాత్రం జోష్ తగ్గకుండా యంగ్ హీరోల‌తో సమానంగా హుక్ స్టెప్స్ వేస్తూ అభిమానులని అలరిస్తున్నారు. సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ ముందు వ‌రుస‌లో నిలుస్తూ డాన్స్ లను అదరగొడ్తున్నారు. వారి స్టెప్పులతో ప్రేక్షకులని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. రీసెంట్ గా 'బాస్ పార్టీ ' అంటూ త‌న‌దైన మార్కు స్టెప్పుల‌తో మెస్మేరైజ్ చేసారు మెగాస్టార్. 

సంక్రాంతి పండుగ సందర్భంగా బ‌రిలో దిగ‌నున్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని మేక‌ర్స్ రీసెంట్ గా లిరిక‌ల్ వీడియోల‌తో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. జ‌న‌వ‌రి 13న 'వాల్తేరు వీర‌య్య‌' రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు స‌రిగ్గా ఒక్క రోజు ముందు అంటే జ‌న‌వ‌రి 12న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 'వీర సింహారెడ్డి' రిలీజ్ కాబోతోంది. 'క్రాక్‌' సినిమాతో  ప్రేక్షకుల ముందుకి వ‌చ్చేసిన గోపీచంద్ మ‌లినేని ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పాట మిన‌హా పూర్త‌యింది. ప్ర‌స్తుతం చివ‌రి పాట‌ని చిత్రీక‌రిస్తున్నారు. శృతిహాసన్‌, బాల‌య్య‌పై ఈ పాట‌ని అన్న‌పూర్ణ స్టూడియోస్ లో షూట్ చేస్తున్నారు. ఇదిలా  ఉండగా తాజాగా ఈ మూవీ నుంచి స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్ ని రాజ్ చేయడం జరిగింది. 'మా బావ మ‌నోభావాలు' అంటూ ఓ లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. త‌మ‌న్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట‌కు రామ‌జోగ‌య్య‌శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు.

బాల‌య్య‌, హ‌నీరోజ్‌, చంద్రిక ర‌విల‌పై చిత్రీక‌రించిన దాబా సాంగ్ ఇది. ఈ పాట‌లో హాట్ లేడీ చంద్రిక ర‌వి చేసిన గ్లామ‌ర్ షో కంటే బాల‌య్య వేసిన హుక్ స్టెప్ లు, సోడా బండి వెన‌కాల వెళ్ల‌కిలా వేళాడుతూ బాల‌య్య చేసిన లెగ్ మూవ్ మెంట్ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. 62 ఏళ్ల వ‌య‌సులో బాల‌య్య వేసిన హుక్ స్టెప్ ల‌తో ఈ లిరిక‌ల్ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. విమర్శకుల మన్ననలను అందుకుంటుంది. లేట్ వయసులో సైతం కుర్ర హీరోలకి ఏ మాత్రం తీసిపోము అని ఈ సీనియర్ హీరోలు మరోసారి నిరూపించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :