ASBL NSL Infratech

ఆ మూడు దేశాలకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం : అమెరికా

ఆ మూడు దేశాలకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం  : అమెరికా

ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌, తైవాన్‌లకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందించే బిల్లుకు అమెరికా సెనేట్‌ ఆమోద ముద్ర వేసింది. విదేశీ యుద్ధాల్లో అమెరికా ఎలా జోక్యం చేసుకుంటున్నదీ సెనేట్‌లో చర్చకు వచ్చింది. చివరికి ఈ  మూడు దేశాలకు కలిపి మొత్తంగా 9500 కోట్ల డాలర్ల సాయానికి పచ్చజెండా ఊపింది.  ఈ బిల్లును సెనెట్‌లో ఓటింగ్‌కు పెట్టగా 79`18 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ నెల 20నే ప్రతినిధుల సభ ప్యాకేజీని ఆమోదించింది. బైడెన్‌ వెంటనే ఈ బిల్లుపై సంతకం పెట్టి ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపించే ప్రక్రియను వేగవంతం చేస్తారని భావిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్‌  మానవతా సాయానికి సహాయం చేసే పద్దు కింద అంటే యుద్ద సాయం కింద 2600 కోట్ల డాలర్లను అందచేస్తుంది. తైవాన్‌కు 800 కోట్ల డాలర్లను అందచేయనుంది. ఇప్పటికే వంద కోట్ల మేర సాయం పంపడం జరిగిందని, మిగిలింది రాబోయే వారాల్లో అందుతుందని అమెరికా అధికారులు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :