ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రాచీన కళాఖండాలను భారత్ కు అప్పగించిన అమెరికా

ప్రాచీన కళాఖండాలను భారత్ కు అప్పగించిన అమెరికా

భారత్‌ నుంచి పలు సందర్భాల్లో తరలించిన 105 కళాఖండాలను అమెరికా తిరిగి అప్పగించింది. ఇందులో 2వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఉన్న కళాఖండాలున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా వాటిని వెనక్కి ఇచ్చేస్తామని ఆ దేశం ప్రకటించింది. అందులో భాగంగానే వాటిని భారత్‌కు అప్పగించింది. న్యూయార్క్‌లోని భారత్‌ కాన్సులేట్‌లో జరిగిన కార్యక్రమంలో రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు వాటిని స్వీకరించారు. వాటిలో తూర్పు భారతానికి చెందినవి 47, దక్షిణ భారతానికి చెందినవి 27, మధ్య భారతానికి చెందినవి 22, ఉత్తర భారతానికి చెందినవి 3 ఉన్నాయి. అవి టెర్రాకోట్‌, రాయి,  లోహం, చెక్కతో తయారు చేశారు. వాటిని భారత్‌కు అప్పగించడానికి కృషి చేసిన మన్‌హటన్‌ జిల్లా అటార్నీకి, హోంల్యాండ్‌ భద్రతా విభాగానికి, ఇతర విభాగాలకు సంధు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :