ASBL NSL Infratech

మణిపుర్ లో మానవహక్కుల ఉల్లంఘన : అమెరికా

మణిపుర్ లో మానవహక్కుల ఉల్లంఘన : అమెరికా

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని అమెరికా పేర్కంది. అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మానవ హక్కుల విధానాలపై రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అప్పటి ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిగ్గుచేటని అభివర్ణించారని. చర్యలు చేపట్టాలని కోరారని తెలిపింది. బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ)పై ఆదాయపు పన్ను దాడులు, గుజరాత్‌ న్యాయస్థానం రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్నీ ప్రస్తావించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ నివేదికను విడుదల చేశారు.  మానవ హక్కుల, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి కొన్ని సానుకూల అంశాలను సైతం ఇందులో ప్రస్తావించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :