ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇండియాపై అమెరికా మాంద్యం ఎఫెక్ట్

ఇండియాపై అమెరికా మాంద్యం ఎఫెక్ట్

మాంద్యం, ద్రవ్యోల్బణం సమస్యలతో సతమతమవుతున్న అమెరికాను..మరో భయం వేధిస్తోంది.  అదే ఆర్థిక దివాళా...డెమొక్రాట్లు, రిపబ్లికన్ల వైరం ఫలితంగా ప్రభుత్వానికి డబ్బుల కటకట ఏర్పడింది. గతంలో చాలాసార్లు అప్పు పరిమితి పెంపునకు విపక్షం సహకరించగా.. ఈసారి మాత్రం రిపబ్లికన్లు ససేమిరా అంటున్నారు. ఖర్చులు తగ్గించుకోవాల్సిందేనంటున్నారు. అప్పు పరిమితి పెరగకుంటే మాంద్యం తప్పదని అమెరికా ఆర్థికమంత్రి చేతులెత్తేశారు. ఇప్పుడు అమెరికాలో మాంద్యం ఏర్పడితే  అన్న ఊహ... ఇండియన్లను భయపెడుతోంది.

అమెరికాతో వ్యాపారపరంగా బలమైన సంబంధాలున్న ఇండియా.. యూఎస్ మాంద్యం నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. సాధారణ ఫెడ్ నేతృత్వంలోని మాంద్యాలలో కూడా దేశీయ వృద్ధి 1.5-2.5 శాతం మందగించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఎగుమతుల శాతం 18.1శాతంగా ఉంది. ఈస్ధాయిలో వ్యాపార ప్రయోజనాలుండడంతో.. మాంద్యం కొనసాగితే.. భారతీయ కంపెనీలకు సమస్యాత్మకంగా మారనుంది.

2021 ఆర్థిక సంవత్సరంలో భారతీయ సాఫ్ట్ వేర్ ఎగుమతులకు అమెరికా ప్రధాన ప్రధాన గమ్యస్థానంగా ఉంది, ఎగుమతుల్లో 54.8 శాతం వాటాను కలిగి ఉంది. యూరప్ 30.1 శాతం వాటా ఉంది, యూరప్ వాటాలో సగం వరకూ ఎగుమతులు ఇంగ్లండుకే కొనసాగుతున్నాయి. దీంతో US మాంద్యం భారతదేశం యొక్క సాఫ్ట్‌వేర్ ఎగుమతులపై మార్జిన్‌లో కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా చెల్లింపుల్లో ఆలస్యంగా కంపెనీల మనుగడకే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

ఇప్పటికే సాఫ్ట్ వేర్ రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది మరీ ముఖ్యంగా కరోనా , తర్వాతి పరిణామాల్లో చాలా కంపెనీలు.. ఉద్యోగులను మూకుమ్మడిగా తొలగిస్తున్నాయి. దీనికి మాంద్యం ఎఫెక్ట్ కూడా తోడైతే ఆఊహే సాఫ్ట్ వేర్ ఉద్యోగులను భయపెడుతోంది. ఆ విధంగా జరగకుండా అమెరికన్ సర్కార్ , విపక్షాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రవాస భారతీయులు కోరుతున్నారు.ఇక ఇండియాలోని మెట్రోసిటీస్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగుల్లోనూ అదే భయం కనిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :