భారత్ లోకి అమెరికన్ వెస్టింగ్ హౌస్ ప్రవేశం

భారత్ లోకి అమెరికన్ వెస్టింగ్ హౌస్ ప్రవేశం

అమెరికాకు చెందిన వినిమయ భారీ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ వెస్టింగ్‌ హౌస్‌ భారత్‌లోకి ప్రవేశించి, తన మేడ్‌ ఇన్‌ ఇండియా టీవీ మోడళ్లను విడుదల చేసింది. ఈ బ్రాండ్‌ భారత్‌లో ఉత్పత్తులను తయారు చేసి సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌పిపిఎల్‌)తో ఉత్పత్తులు వినియోగదారులకు దేశంలో అతిపెద్ద ఇ`కామర్స్‌ మార్కెట్‌ప్లేస్‌ అమెజాన్‌లో ది గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ సీజన్‌లో అందుబాటులో ఉంటాయి. వీటి విడుదల గురించి దేశంలో వెస్టింగ్‌హౌస్‌ ప్రత్యేక బ్రాండ్‌ లైసెన్సీ సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉపాధ్యక్షురాలు పల్లవి సింగ్‌ మాట్లాడుతూ ఇతర పెద్ద బ్రాండ్ల భాగస్వామ్యం తరహాలోనే తాము ఆత్మనిర్భర భారత్‌కు తమ వంతు సేవను కొనసాగిస్తామని తెలిపారు. కొత్తగా విడుదలైన డబ్ల్యూ సీరిస్‌ ధరలు రూ.7999 నుంచి ప్రారంభవుతాయి. ఈ శ్రేణిలో 24 అంగుళాల నాన్‌ `స్మార్ట్‌ ఎల్‌ఇడి టివి. 4 స్మార్ట్‌ ఆండ్రాయిడ్‌ టివీ మోడళ్లు ఉన్నాయి.

 

Tags :