ASBL NSL Infratech

అమెరికాను దూరం పెట్టి ఐరాసలో ఓటింగ్!

అమెరికాను దూరం పెట్టి ఐరాసలో ఓటింగ్!

గాజా ప్రజలకు మానవతా సాయాన్ని అందించేందుకు వీలుగా కాల్పుల విరమణ పాటించేలా మరోసారి ఐక్యరాజ్య సమితి ఓటింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్రిటిష్‌ సీక్రెట్‌ ఇంటెలిజెన్‌స సర్వీస్‌ మాజీ చీఫ్‌ జాన్‌ సాయర్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ఈసారి ఓటింగ్‌కు దూరంగా ఉంచాలనే ముసాయిదాను రూపొందించేందుకు దౌత్యవేత్తలు యోచిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఉందని చెప్పారు. ఇంతకు ముందు కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్య సమితి ఓటింగ్‌ నిర్వహించగా వీటో అధికారంతో ఆమోదం పొందకుండా అమెరికా అడ్డుకుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :