ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎలాన్ మస్క్ కు షాక్... భారీగా తగ్గిన

ఎలాన్ మస్క్ కు షాక్... భారీగా తగ్గిన

సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ విలువ 15 బిలియన్‌ డాలర్లే. కానీ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ దీనిని 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. అంటే ఆయన చెల్లించిన ధర కంటే ట్విట్టర్‌ అసలు విలువ 66 శాతం తక్కువగా ఉంది. మస్క్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్విట్టర్‌ ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం ఆర్థిక సేవల దిగ్గజం ఫిడిలిటీ తన పోర్ట్‌ఫోలియో వాల్యుయేషన్‌ నెలవారీ నివేదికలో ట్విట్టర్‌ కోసం ఎలాన్‌ మస్క్‌ చెల్లించిన ధర ఇప్పుడు మూడింట ఒక వంతు మాత్రమే అని అంచనా వేసింది. ట్విట్టర్‌లో మస్క్‌ పెట్టుబడి ఇప్పుడు 8.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీలో 79 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు 25 బి. డాలర్లకు పైగా ఖర్చు చేశారు. 33.5 బి.డాలర్ల ఈక్విటీతో సహా ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి తాను ఎక్కువ చెల్లించానని మస్క్‌ గతంలో అంగీకరించాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :