ASBL NSL Infratech

బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు టీటీఏ మెగా కన్వెన్షన్‌ ఆహ్వానం

బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు టీటీఏ మెగా కన్వెన్షన్‌ ఆహ్వానం

తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ప్రతినిధులు కలిశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా సేవలందించిన ఆయన్ను టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్ రీజనల్ అడ్వైజర్స్ డాక్టర్ ద్వారకానాథ రెడ్డి, నవీన్ గోలి, సీఈసీ ఈవీపీ డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి దొంతిరెడ్డితోపాటు ఈసీ, బీవోడీ జ్యోతి రెడ్డి దూదిపాల, బీవోడీ దుర్గాప్రసాద్ సెలోజ్ తదితరులు కలిసి టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. వీరంతా ప్రత్యేకంగా భారత్‌కు వచ్చి వీవీఐపీలను టీటీఏ మెగా కన్వెన్షన్‌కు ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమం మే నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనుంది. సియాటెల్‌లో జరగనున్న ఈ వేడుకల్లో పాల్గొనాలని అనుకునే వారు https://tinyurl.com/ttaregistration లింకులో తమ పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వేడుకల్లో ఎన్నో ఉత్సాహవంతమైన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :