ASBL Koncept Ambience
facebook whatsapp X

మణిశర్మ పాటలతో అలరించిన టిఎల్‌సిఎ దీపావళి

మణిశర్మ పాటలతో అలరించిన టిఎల్‌సిఎ దీపావళి

న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకలు కన్నులపండువగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత విభావరి కార్యక్రమాలకు హైలైట్‌గా నిలిచింది. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ అలరించాయి. న్యూయార్క్‌ లోని క్రాన్సాఫ్‌ థియేటర్‌ వేదికగా తెలుగుదనం ఉట్టిపడేలా ఈ దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌ పరిసర ప్రాంతాల నుంచి తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ- సినీ పాటలు, నృత్యాలు, ఫ్యాషన్‌ షో వంటి వైవిధ్య భరితమైన వినూత్న కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. 
  
టిఎల్‌సిఎ అధ్యక్షుడు నెహ్రూ కఠారు ఆద్వర్యంలో జరిగిన ఈ వేడుకల కల్చరల్ కార్యక్రమాలను వైస్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌ పర్వతాల, సెక్రటరీ సుమంత్ రామిశెట్టి, ఈసీ మెంబెర్ లావణ్య అట్లూరి లు నిర్వహించారు. ట్రెజరర్ మాధవి కోరుకొండ, జాయింట్ ట్రెజరర్  అరుంధతి అడుప లు వేదికకు విచ్చేసిన అతిధులకు స్వాగతాలు చెబుతుండగా; జాయింట్ సెక్రెటరి శ్రీనివాస్ సనిగేపల్లి, ఈసీ మెంబెర్ భగవాన్ నడింపల్లి అతిధులకు సత్కారాలు అందించారు. ఈసీ మెంబర్లు కరుణ ఇంజపూరి, సునీల్ చల్లగుల్ల లు భోజన సదుపాయాలు సమకూర్చి చక్కని విందు భోజనం అందించారు. ఈసీ మెంబెర్ దివ్య దొమ్మరాజు, ఎక్సఆఫీషిఓ జయప్రకాష్ ఇంజపురి లు అన్ని కార్యక్రమాలను సమన్వయం చేశారు. 

ప్రముఖులు డా. పైళ్ళ మల్లారెడ్డి, డా. పూర్ణ అట్లూరి, డా. నోరి దత్తాత్రేయుడు, బిఓటి చైర్మన్‌ అంకినీడు ప్రసాద్‌, బిఓటి ట్రస్టీలు తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. టిఎల్‌సిఎ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వినోదం విజ్ఞానం మేళవించిన కార్యక్రమం అని పలువురు కొనియాడారు.  

గణేశ ప్రార్థనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నాగప్రవీణ సిద్దవటం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సాధనాలయ డ్యాన్స్‌ స్కూల్‌వారు, సాధనపరంజి ఆధ్వర్యంలో జానపదనృత్యం, కోలాటం డ్యాన్స్‌లు, గిరిజా కళ్యాణం, శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శించారు. సీత హేమరాగిణి ఆధ్వర్యంలో స్టూడెంట్‌లు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. మేఘనారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులు పాడిన దీపావళి పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. హంసాస్య స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ ఆధ్వర్యంలో స్టూడెంట్‌లు ప్రదర్శించిన ఫిల్మీఫ్యూజన్‌, డ్యాన్స్‌ ధమాకా, భరతనాట్యం ఆకట్టుకుంది. టాలీవుడ్‌ మెడ్లీ కూడా అలరించింది. ఉమ పుటానే ఆధ్వర్యంలో దివాళీ ధమాకా కార్యక్రమం కూడా జరిగింది. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలకు సంగీతం అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ లైవ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ ప్రేక్షకులని ఉర్రుతలూగించింది. మణిశర్మ తన ట్రూప్‌ తో కలిసి మ్యూజిక్‌ తో అందరినీ ఎంటర్టైన్‌ చేశారు. సింగర్స్‌ వైష్ణవి, శృతిక, స్వరాగ్‌, పవన్‌ తదితరులు సూపర్‌ హిట్‌ పాటలు పాడి ఆడియన్స్‌లో జోష్‌ నింపారు. నటి స్పందన పల్లి ఫ్యాషన్‌ వాక్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలిచింది. షాపింగ్‌ స్టాల్స్‌, బహుమతులు, మెహందీ, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి వేడుకలు అసాంతం ఉత్సాహంగా సాగాయి. ఫుడ్‌ కమిటీ, కల్చరల్‌ కమిటీ, హాస్పిటాలిటీ కమిటీలతోపాటు ఇతర టిఎల్‌సిఎ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :