ASBL NSL Infratech

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ ఘనవిజయం

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ ఘనవిజయం

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ ఘన విజయాన్ని సాధించింది. 24 కార్మిక సంఘాల నాయకులు, కార్మిక సోదర సోదరిమణులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో 2023-2025 సంవత్సరానికి గాను ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ గా పీఎస్ఎన్ దొరను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారిగా పోటీ చేసిన సురేష్ గెలుపొందారు. కోశాధికారి పదవికి ఫెడరేషన్ మొత్తం ఓట్లు -72 కాగా..60 ఓట్లు పోలయ్యాయి. అందులో సతీష్ కు -16 ఓట్లు రాగా..సురేష్ కు 44 ఓట్లు వచ్చాయి. 28 ఓట్ల మెజారిటీతో సురేష్ కోశాధికారిగా గెలుపొందారు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్  అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ...మరోసారి తమ ప్యానెల్ పై నమ్మకం ఉంచి ఘన విజయాన్ని అందించిన కార్మిక సోదర సోదరీమణులకు, 24 కార్మిక సంఘాల నాయకులకు, తోటి కౌన్సిల్ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదములు.  సినిమా ఇండస్ట్రీ లో ఉన్న 25 వేల మంది సినిమా కార్మికుల కష్టనష్టాలు తెలిసిన నాయకులుగా మరొకమారు మమ్మల్ని కార్మికులు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఫెడరేషన్ కు, సినిమా కార్మికులకు తగు న్యాయం చేసే విధంగా మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరిని కలుపుకొని ముందుకు సాగుతాము అని తెలియజేయుచున్నాము.  ఈ గెలుపు 24 సంఘాల సినిమా కార్మికులదే.  ఈ గెలుపు ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు కొమర వెంకటేష్ గారికి, వికాస్ ( విక్కీ ) కు అంకితం. అన్నారు.

ఇట్లు
అనిల్ కుమార్ వల్లభనేని -అధ్యక్షులు
పీఎస్ఎన్ దొర -సెక్రటరీ
వంకినేని సురేష్ - కోశాధికారి
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :