ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మహారాష్ట్రలోనే కాదు దేశ రాజధానిలోనూ అదే దుస్థితి : సీఎం కేసీఆర్

మహారాష్ట్రలోనే కాదు దేశ రాజధానిలోనూ అదే దుస్థితి : సీఎం కేసీఆర్

భారతదేశానికి ఏమైనా లక్ష్యం ఉందా? లక్ష్యం లేని దేశం ఎక్కడికి వెళ్తోంది. ఈ విషయం ఆలోచిస్తే నాకు భయం వేస్తోంది అని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ మాట్లాడారు. దేశంలో ఎలాగైనా ఎన్నికల్లో  గెలవడమే కొందరికి లక్ష్యంగా మారింది. ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ నేతలు కాదు, జనం గెలవాలి. ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతుంది.  దేశ ప్రజలు చంద్రుడు, నక్షత్రాలు కోరట్లేదు. నీళ్లు ఇవ్వమని కోరుతున్నారు అన్నారు.

ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి తాగునీరు వస్తోందని చెప్పారు. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన డిల్లీలోనూ ఇదే దుస్థితి. మహారాష్ట్ర దేశంలోనే నెంబవర్‌ వన్‌ రాష్ట్రం. వివిధ పార్టీల నుంచి ఎందరో సీఎంలు  వచ్చారు. కానీ, ఇక్కడి పరిస్థితులను మాత్రం ఏ సీఎం మార్చలేదు. మహారాష్ట్ర సంగతి పక్కన పెట్టండి. దేశ  రాజధానిలోనూ అదే దుస్థితి. ఢల్లీిలో తాగునీరే కాదు. విద్యత్‌ కొరత సమస్య కూడా ఉంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిరది. కాంగ్రెస్‌  గెలిచింది. పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎవరు గెలిచి ఏం ప్రయోజనం? ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాలు చేయాలి. బరాక్‌ ఒబామా అధ్యక్షుడు అయ్యాకే అమెరికాలో పాప ప్రక్షాళన జరిగిందన్నారు.

గతంలో తెలంగాణలో మహారాష్ట్ర కంటే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగేవి. తెలంగాణలా చేస్తే మహారాష్ట్ర దివాలా తీస్తుందని కొందరు మరాఠా నేతలు అంటున్నారు. తెలంగాణ తరహాలో చేస్తే మరాఠా నేతలు దివాలా తీస్తారు. ప్రజలు దీపావళి జరుపుకొంటారు. మహారాష్ట్రకే వెళ్తున్నారు. మా మధ్యప్రదేశ్‌కు రావట్లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. మహారాష్ట్రలో తెలంగాణ నమూనా పాలన వచ్చే వరకు బీఆర్‌ఎస్‌ పోరాడుతోంది. మహారాష్ట్రలో అనేక మంది నేతలు బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. త్వరలోనే లక్షల సంఖ్యలో బీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు నమోదవుతాయి. మహారాష్ట్రలో తర్వలోనే పరివర్తన వస్తుంది. అది దేశమంతా పాకుతుంది. త్వరలో పుణె, ఔరంగబాద్‌లో బీఆర్‌ఎస్‌ కార్యాలయాలు ప్రారంభిస్తాం అని కేసీఆర్‌ తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :