ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అన్నార్తులను ఆదుకున్న తానా న్యూఇంగ్లాండ్‌ టీమ్‌

అన్నార్తులను ఆదుకున్న తానా న్యూఇంగ్లాండ్‌ టీమ్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూ ఇంగ్లాండ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫీడ్‌ ది నీడీ పేరుతో 1500.00డాలర్ల విలువ చేసే ఆహారపదార్థాలను కనెక్టికట్‌లోని సెంట్‌ ఇసాక్‌ జోగ్‌ ఫుడ్‌బ్యాంక్‌కు అందజేశారు. తానా న్యూఇంగ్లాండ్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ప్రదీప్‌ కుమార్‌ గడ్డం ఆధ్వర్యంలో జనవరి 15వ తేదీన ఈ కార్యక్రమం జరిగింది. కనెక్టికట్‌లో ఉన్న మిత్రులు, దాతల సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రదీప్‌కుమార్‌ గడ్డం తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తానా పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఫుడ్‌బ్యాంక్‌వారు అభినందించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :