ASBL NSL Infratech

ఎస్.ఎస్. రాజమౌళి మరో ఘనత .. టైమ్ జాబితాలో

ఎస్.ఎస్. రాజమౌళి మరో ఘనత .. టైమ్ జాబితాలో

బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మరో ఘనత సొంతం చేసుకున్నారు. 2023కు గానూ ప్రఖ్యాత టైమ్‌ మేగజీన్‌ విడుదల చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ప్రముఖ బాలీవుడు నటుడు షారుక్‌ ఖాన్‌, రచయిత సల్మాన్‌ రష్దీ, బుల్లితెర ప్రయోక్త, న్యాయనిర్ణేత పద్మా లక్ష్మీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌, స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకులు ఎలాన్‌ మస్క్‌, ప్రఖ్యాత గాయని బియాన్స్‌ కూడా ఈ జాబితాలో నిలిచారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించిన ప్రముఖ నటి ఆలియా భట్‌ రాజమౌళి గురించి టైమ్‌ మేగజీన్‌లో ప్రొఫైల్‌ రాశారు. భారత్‌లో విభిన్నమైన సంస్కృతులు, అభిరుచులు ఉన్న ప్రేక్షకులను ఆయన తన చిత్రాలతో ఏకం చేస్తున్నారు అని ఆలియా కొనియాడారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :