ASBL NSL Infratech

శ్రీలీల‌కు అక్క‌డ గోల్డెన్ ఎంట్రీ ద‌క్కుతుందా?

శ్రీలీల‌కు అక్క‌డ గోల్డెన్ ఎంట్రీ ద‌క్కుతుందా?

మొన్న‌టివ‌ర‌కు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు కెరీర్ కు ఇప్పుడు బ్రేక్ ప‌డింది. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసం బ్రేక్ తీసుకుంద‌ని చెప్తున్న‌ప్ప‌టికీ శ్రీలీల‌కు ఇప్పుడు మునుప‌టిలా ఆఫ‌ర్లు రావ‌డం మానేశాయి. ఇదిలా ఉంటే అజిత్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో శ్రీలీల ఎంపికైంద‌నే వార్త నిన్న‌టి నుంచి నెట్టింట తెగ ప్ర‌చార‌మ‌వుతుంది. నిర్మ‌ణ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు కానీ ప్ర‌చార‌మైతే బాగా జ‌రుగుతుంది. మ‌రి ఈ సినిమాలో శ్రీలీల అజిత్ స‌ర‌స‌న న‌టిస్తుందా లేదా ఇంకేమైనా ట్విస్ట్ ఉందా అన్న‌ది తెలియాల్సి ఉంది. మామూలుగా అయితే అజిత్ ఇంత చిన్న వ‌య‌సు అమ్మాయిని త‌న ప‌క్క‌న హీరోయిన్ గా ఒప్పుకోడు. కాబ‌ట్టి శ్రీలీల సినిమాలో హీరోయిన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు.

భ‌గ‌వంత్ కేస‌రి లాంటి క‌థ‌లో కీల‌క పాత్ర కోసం శ్రీలీలను సంప్ర‌దించి ఉండొచ్చు. ఇదే నిజ‌మైతే శ్రీలీల‌కు కోలీవుడ్ లో మంచి డెబ్యూ దొరికిన‌ట్లే. నితిన్ రాబిన్ హుడ్ కోసం మైత్రీ నుంచి అడ్వాన్స్ తీసుకున్న శ్రీలీల అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఆ అడ్వాన్స్ ను వాప‌స్ తీసుకోకుండా తాము నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీని ఆఫ‌ర్ చేశార‌ట మైత్రీ నిర్మాత‌లు. దానికి శ్రీలీల ఒప్పుకుందా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం శ్రీ లీల చేతిలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ త‌ప్ప మ‌రో ప్రాజెక్ట్ లేదు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :