ASBL NSL Infratech

శ్రీలీల‌ను లాక్ చేసేసిన సితార‌

శ్రీలీల‌ను లాక్ చేసేసిన సితార‌

ఒకే బ్యాన‌ర్లో ఒకే హీరోతో వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం ఎప్ప‌టి నుంచో వ‌స్తూనే ఉంది. కానీ ఇలాంటివి హీరోయిన్ల విష‌యంలో చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి. అందులోనూ ఒక ఫ్లాప్ వ‌స్తే మార్కెట్ లెక్క‌లు మారిపోతున్న త‌రుణంలో ఒక నోటెడ్ ప్రొడ‌క్ష‌న్ ఒకే హీరోయిన్‌ని ఎక్కువ సినిమాల్లో లాక్ చేసుకోవ‌డం నిజంగా విశేష‌మ‌నే చెప్పుకోవాలి. 

రోజూరోజూకీ డిమాండ్ పెరుగుతున్న శ్రీలీలని సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ వ‌రుస‌గా నాలుగు సినిమాల‌కు లాక్ చేసింది. అందులో మొద‌టిది మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్‌ల కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. రెండోది న‌వీన్ పోలిశెట్టి హీరోగా రాబోయే సినిమా. ఈ షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ బ‌య‌ట‌కు రాలేదు క‌నీ స‌గానికి పైగానే షూటింగ్ పూర్తైంద‌ట‌.  

మూడో సినిమా పంజా వైష్ణ‌వ్ తేజ్‌తో ప్లాన్ చేసిన భారీ సినిమాలోనూ శ్రీ లీల‌నే ఫిక్స్ చేశారు. ఇది కూడా చిన్న బ‌డ్జెట్ మూవీ కాదు. ఇక నాలుగో సినిమా విజ‌య్ దేవ‌ర‌కొండతో. గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్‌లో రాబోతున్న ఈ సినిమాలో కూడా శ్రీలీలనే తీసుకున్నార‌ట‌. ఇవి కాకుండా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉన్న మ‌రో సినిమాకు సైతం శ్రీ లీలనే అడుగుతున్న‌ట్లు తెలుస్తోంది. 

అంటే కేవ‌లం సితార ఎంట‌ర్టైన్మెంట్స్ నుంచే శ్రీ లీల కోట్ల‌లో పారితోష‌కం అందుకోబోతోంది. ఇవి కాకుండా ఇంకా మిగిలిన ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల సినిమాలు కూడా క‌లిపి శ్రీ లీల చేతిలో దాదాపు ప‌ది దాకా సినిమాలున్నాయి. ప్ర‌స్తుతం సౌత్ లో ఏ హీరోయిన్ కూడా ఇంత బిజీగా లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :