ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్ టైటిల్ గెలుచున్న శృతిక సముద్రాల; రన్నరప్ గా వెంకట సుధాన్షు

జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్ టైటిల్ గెలుచున్న శృతిక సముద్రాల;  రన్నరప్ గా వెంకట సుధాన్షు

ఇరవైఆరు వారాలపాటు నాన్-స్టాప్ వినోదాన్ని పంచి, ఎంతోమంది అద్భుతమైన సింగర్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేసి వారి అభిమానాన్ని చూరగొన్న జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్ కార్యక్రమం నేటితో ముగిసింది. ఫినాలే లో అదరగొట్టే ప్రదర్శనలతో హైదరాబాద్ కి చెందిన శృతిక సముద్రాల (20) టైటిల్ విజేతగా నిలవగా, తనకు గట్టి పోటీ ఇచ్చిన వెంకట సుధాన్షు రన్నరప్ గా నిలిచాడు. ప్రెస్టీజియస్ జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్ ట్రోఫీతో పాటు, శృతిక లక్ష రూపాయల నగదు మరియు మారుతి సుజుకి వాగన్-ఆర్ కారుని బహుమానంగా అందుకోగా, వెంకట సుధాన్షు 5 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు.     

నేడు అనగా ఆగష్టు 14 న ప్రసారమైన ఫినాలే ఎపిసోడ్ లెజెండరీ సింగర్ P సుశీల, సూపర్ స్టార్స్ శృతి హాసన్, నితిన్, మరియు క్రితి శెట్టి సమక్షంలో 8 మంది ఫైనలిస్ట్స్ అద్భుతమైన ప్రదర్శనలతో అందరిని మైమరిపించారు. ఈ ఫినాలే స్టేజ్ వేదికగా P సుశీల గారు తాను సంగీత ప్రపంచాన్ని చేసిన సేవలను గుర్తిస్తూ చేసిన సన్మానం ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవగా, 'ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్' వేడుకలలో భాగంగా మాజీ సైనికులను చేసిన సన్మానం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో ఫినాలే లో జడ్జెస్ ని మెప్పించి, టైటిల్ గెలుచుకున్న శృతిక, B.A (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) లో డిగ్రీ పూర్తిచేసింది. ఆరు సంవత్సరాల వయస్సులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన శృతిక, కర్నాటిక్ సంగీతంలో శిక్షణ తీసుకుంది. ఈ సందర్బంగా, శృతిక మాట్లాడుతూ..."జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్ విన్నర్ గా నిలవడం ఒక డ్రీం-కం-ట్రూ మూమెంట్. ఇది నా లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్ మరియు ఎప్పటికి మరిచిపోలేనిది. ఈ ట్రోఫీని నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తాను. నాతో పాటు, నా తోటి ఫైనలిస్ట్స్ కూడా అద్భుతంగా పాడారు, కావున వారికి కూడా సమానమైన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సరిగమప జర్నీలో వారు నాకు ఎంతగానో సపోర్ట్ చేసారు మరియు వారి దగ్గర నుండి ఎంతో నేర్చుకున్నాను. అదేవిధంగా, ఈ జర్నీ లో నాకు సహకరించిన జీ సరిగమప టీం, ముఖ్యంగా మెంటర్స్, జడ్జెస్, వాయిస్ ట్రైనర్ లకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే, నేను సింగర్ గా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తూవస్తున్న మా నాన్న శశికాంత్, అమ్మ రూప మరియు అక్క శరణ్య కి, అలాగే సంగీతంలో ఓనమాలు నేర్పిన నా గురువులు శ్రీ రామాచారి కొమండూరి గారికి, శ్రీ నిహాల్ కొండూరి గారికి, వసుమతి మాధవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు."       

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :