అర్హను ఆకాశానికెత్తేసిన సమంత
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలకు సంబంధించిన కొడుకులంతా వేరే ఆప్షనే లేనట్లు హీరోలైపోతారు. అమ్మాయిలు పుడితే మాత్రం చెప్పలేం. మెగా ఫ్యామిలీలోని అమ్మాయిల సంగతి చూస్తే, నాగబాబు కూతురు నిహారిక ఒక మనసు సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్‌కు పరిచయమైంది. కానీ సక్సెస్ కాలేక వెనక్కి వెళ్లిపోయి, వెబ్ సిరీస్ లు నిర్మిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుశ్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా తన లక్ ని పరీక్షించుకుంటుంది. ఇక ఆ ఫ్యామిలీ నుంచి అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హనే. వయసు పరంగా అర్హ చిన్నదే అయినా ఈ వయసులోనే అర్హ టాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తుంది. సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో అర్హ కీలక పాత్ర చేయబోతున్న విషయం తెలిసిందే.
శాకుంతలం టీజర్లో ఆమె సింహం మీద వస్తున్న సీన్ ఇప్పటికే హైలైట్ గా నిలవడంతో సినిమాలో అర్హ ఎక్స్‌ప్రెషన్స్, యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ చూడటానికి అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంత, అల్లు అర్హకు ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తుంది.
అల్లు అర్హ బోర్న్ సూపర్ స్టార్ అని, తను తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుందని, ఈ విషయంలో అర్హ పేరెంట్స్ అయిన బన్నీ, స్నేహలను మెచ్చుకోవాలని సమంత అంది. అంతే కాదు అర్హ ఎంత పెద్ద డైలాగునైనా చాలా తేలికగా, భయం లేకుండా చెప్పడం చూస్తే చాలా ముచ్చేటేసిందని, అర్హకు యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకునే పనిలేదని తను పుట్టుకతోనే సూపర్ స్టార్ అని సమంత అర్హను ఆకాశానికెత్తేసింది. ఇదిలా ఉంటే శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.