ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత : మూడు సినిమాల ఆఫర్ ఇచ్చిన య‌ష్ రాజ్ ఫిలింస్‌?

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత : మూడు సినిమాల ఆఫర్ ఇచ్చిన య‌ష్ రాజ్ ఫిలింస్‌?

సమంత త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో బ‌డా నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్‌లో స‌మంత మూడు సినిమాలు చేయ‌డానికి ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దక్షిణాది స్టార్ హీరోయిన స‌మంత ప్లానింగ్ మామూలుగా లేదు. విడాకుల త‌ర్వాత ఆమె ఊసు లేకుండా పోతుందేమో అని కొంద‌రు, డిప్రెష‌న్‌లోకి వెళుతుందేమోన‌ని మ‌రి కొంద‌రు అనుకున్నారు. కానీ.. అంద‌రికీ ఆమె తీరు షాకిస్తోంది. పాన్ ఇండియా సినిమాలు, ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమాల‌ను ఎంచుకుంటూ త‌న రేంజ్‌ను పెంచుకుంటూ వెళుతోంది. స‌మంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుందంటూ వార్త‌లు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఒకానొక సంద‌ర్భంలో ఇదే విష‌యంపై స‌మంత కూడా స్పందించింది. బాలీవుడ్‌కి వెళ్లాల‌నే ఆస‌క్తితో ఏ సినిమా ప‌డితే అది చేయ‌ను. స్క్రిప్ట్ న‌చ్చితేనే బాలీవుడ్ సినిమాలైనా చేస్తాను అని తేల్చి చెప్పేసింది.

లేటెస్ట్‌గా స‌మాచారం మేర‌కు ఓ ప్ర‌ముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ద్వారా స‌మంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ట‌. స‌ద‌రు బ‌డా సంస్థ స‌మంత‌తో ఒక‌టో అరో కాదు.. ఏకంగా మూడు సినిమాల డీలింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇంత‌కీ సద‌రు నిర్మాణ సంస్థ ఏదో కాదు.. బాలీవుడ్‌లో పాపుల‌ర్ అయిన ప్రొడ‌క్ష‌న్ హౌస్ య‌ష్ రాజ్ ఫిలింస్‌. భారీ సంస్థ ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్‌కు సమంత కూడా ఓకే చెప్పిన‌ట్లు టాక్‌. ఇది కాకుండా స‌మంతకు డిజిట‌ల్ రంగంలోనూ స్టార్ ఇమేజ్‌ను క‌ట్ట‌బెట్టిన డైరెక్ట‌ర్స్ రాజ్‌, డీకేల‌తో ఓ వెబ్ సిరీస్ చేయ‌నుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న శాకుంత‌లం సినిమాను పూర్తి చేసిన స‌మంత‌.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.  ఇప్పుడు శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మాత‌గా రూపొందుతోన్న‌య‌శోద సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇది కాకుండా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవ‌న్నీ కాకుండా జాన్ పిలిప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న గ్లోబెల్ మూవీ ది అరెంజ్‌మెంట్ ఆఫ్ లవ్ అనే సినిమాలోనూ నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :