ASBL NSL Infratech

చంద్రబాబు జగన్ నాటకంలో.. జనసేనాని ఒక చిన్న పాత్ర మాత్రమే.. సజ్జల 

చంద్రబాబు జగన్ నాటకంలో.. జనసేనాని ఒక చిన్న పాత్ర మాత్రమే.. సజ్జల 

చంద్రబాబు అపర రాజకీయ చాణిక్యుడని.. అతను ఆడుతున్న నాటకంలో జనసేనాని కేవలం ఒక చిన్న పాత్ర మాత్రమే అని వైసిపి సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు జగన్ విధానాలను తప్పుపడుతున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది ఏమిటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కూటమి అని.. కలిసికట్టుగా ఉందామని కల్లబొల్లి మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ చేతులు కట్టేశాడు చంద్రబాబు అని ఆయన ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చూసిన చంద్రబాబు అది తనకు వ్యతిరేకం అవుతుంది అని గమనించి వాళ్ళ జీతాన్ని పదివేలకు పెంచుతానని దొంగ హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలన కక్ష సాధింపు వైఖరిలో ఉంటుంది అన్న విషయం ఆంధ్ర ప్రజలకు బాగా తెలుసు అన్న సజ్జల ఈసారి కూడా జగన్ ప్రభుత్వమే వస్తుంది అన్న ధీమా వ్యక్తం చేశారు. ఏదైనా సవ్యంగా జరుగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేరని.. దాని గురించి వరుసగా కంప్లైంట్ ఇచ్చి ఆపేదాకా నిద్రపోరని సజ్జల అన్నారు. అందుకే ఆయన వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్ని భ్రమలు కలిగించిన ప్రజలకు నిజం తెలుసని సజ్జల పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :