ASBL NSL Infratech

వచ్చే ఏడాది భారత్ కు ఎస్-400

వచ్చే ఏడాది భారత్ కు ఎస్-400

రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్‌-400 ట్రైయాంఫ్‌ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా సరఫరాల్లో జాప్యంతో ఈ వ్యవస్థలు మన దేశానికి అందడానికి ఆలస్యమవుతోంది. 5.5 బిలియన్‌ డాలర్ల ఒప్పందంలో భాగంగా రష్యా  నుంచి ఇప్పటికే మూడు దీర్ఘశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలు మన దేశానికి అందాయి. మరోపక్క రష్యా తయారీ యుద్ధనౌక తుషిల్‌ ఈ ఏడాది సెప్టెంబరు నాటికి, తమల్‌ అనే మరో వార్‌షిప్‌ వచ్చే జనవరికి మన దేశానికి అందే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ రెండు నౌకలు 2022 నాటికే అందాల్సి ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :