రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు పక్కా.. జోస్యం చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు పక్కా.. జోస్యం చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని, కేసీఆర్ కూడా అదే ప్రణాళికలో ఉన్నారని, ముందస్తు ఎన్నికలకు సరైన వ్యూహ రచన కూడా చేస్తున్నారని తెలంగాణలో తీవ్రంగా ప్రచారం జరిగింది. కానీ ఇటీవల నిర్వహించిన పార్టీ సమావేశంలో తనకు ముందస్తు ఎన్నికల ఆలోచన కూడా లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. అయితే ఈ విషయంపై తాజాగా రాష్ట్ర బీఎస్‌పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ స్పందించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం పక్కా అని జోస్యం చెప్పారు. మరో నెలల్లో కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ, ఈడీ సోదాలన్నీ కూడా టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటాకలని అన్నారు. రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీలకు 27 రిజర్వేషన్లు కల్పిస్తే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై అంశంపై ఈ నెల 26 నుంచి పోరాడతామని వెల్లడించారు. ఈ విషయంలో కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతికి అందిస్తామని, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీలకు ఈడబ్ల్యూఎస్ కోటాలో అవకావాలు కల్పించాలని కోరారు.

 

Tags :