ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బాచుపల్లి కేంద్రంగా రియల్ ఎస్టేట్ నిర్మాణాలు

బాచుపల్లి కేంద్రంగా రియల్ ఎస్టేట్ నిర్మాణాలు

హైదరాబాద్‌లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఎక్కువగా ఉండటంతో ఆ కంపెనీల్లో పనిచేసేవారి కోసం రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు వారికి అనువైన చోట నిర్మాణాలను చేపడుతున్నాయి. ఐటీ కంపెనీలకు సమీపంలో ఉన్న మాదాపూర్‌, గచ్చిబౌలి. వీటికి సమీపంలో కొండాపూర్‌, మియాపూర్‌, హఫీజ్‌పేట, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, నిజాంపేట, కూకట్‌పల్లిలో ఇప్పటికే పెద్ద ఎత్తున నివాస సముదాయాలు వెలిశాయి. ఆయా ప్రాంతాల్లో భారీ నిర్మాణాలకు చోటు లేకుండా కనిపిస్తోంది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు వారికి అనువైన ప్రాంతంగా ఉన్న బాచుపల్లి వైపు దృష్టిని సారించాయి.  ఐటీ కార్యాలయాలకు దగ్గరగా ఉండటం, స్థానికంగా అంతర్జాతీయ విద్యా సంస్థలు, వినోద కేంద్రాలు, ఆసుపత్రులు ఉండటం బాచుపల్లికి అదనపు అంశాలు. ఐటీ కారిడార్‌కు బాచుపల్లి సుమారు 15 కి.మీ. దూరం ఉంటుంది.

మియాపూర్‌, కేపీహెచ్‌బీ వంటి వాణిజ్య కేంద్రాలు చేరువలో ఉన్నాయి. నిజాంపేట, ప్రగతినగర్‌, బౌరంపేట, మోమిన్‌పేట, గాజులరామారం ఇలా చుట్టూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు రహదారులున్నాయి. మియాపూర్‌ నుంచి గండిమైసమ్మ మీదుగా మేడ్చల్‌ వరకు జాతీయ రహదారి ఉంది. పైగా ఈ ప్రాంతం ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు ఆనుకునే ఉండడంతో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా సులభంగా దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చు. పారిశ్రామిక కేంద్రం పటాన్‌చెరు, జిల్లా కేంద్రం మేడ్చల్‌కు ఓఆర్‌ఆర్‌ దగ్గరి దారి. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు, హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌కు 10 కి.మీ. దూరం ఉంటుంది. జేన్‌టీయూ మెట్రో స్టేషన్‌కు 8 కి.మీ. ఇక్కడి నుంచి మెట్రోలో సిటీలోని ఏ ప్రాంతానికైనా నిమిషాల్లోనే చేరుకునే వీలుంది. ఇక్కడ నిర్మాణ సంస్థ, ప్రాజెక్ట్‌ స్థాయిని బట్టి అపార్ట్‌మెంట్‌ ధరలు చ.అ. రూ.4 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మధ్యతరగతి, సంపన్న వర్గాలకు అనుకూలమైన అపార్ట్‌మెంట్లు, లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌లు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడి మౌలిక, రవాణా సదుపాయాలు చూస్తుంటే సమీప భవిష్యత్తులో మియాపూర్‌, కేపీహెచ్‌బీ తరహాలో బాచుపల్లి ప్రాంతం శాటిలైట్‌ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :