తెలంగాణ సిట్ నోటీసులు అందాయి : రఘురామ

తెలంగాణ సిట్ నోటీసులు అందాయి : రఘురామ

టీఆర్‌ఎస్‌ ఎమ్మెలకు ఎర కేసులో తనకు తెలంగాణ సిట్‌ నోటీసులు అందాయని వైఎస్‌ఆర్‌సీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో సిట్‌ నోటీసులు అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి  ఈనెల 29న బంజారాహిల్స్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్‌ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు 41 ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

 

Tags :