ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

లేఆఫ్స్ ప్రకటించిన అమెరికన్ చిప్ దిగ్గజం క్వాల్ కాం

లేఆఫ్స్ ప్రకటించిన అమెరికన్ చిప్ దిగ్గజం క్వాల్ కాం

అమెరికన్‌ చిప్‌ దిగ్గజం క్వాల్‌కాం లేఆఫ్స్‌ను ప్రకటించింది. తన ఉద్యోగుల్లో 2.5 శాతం మందిని దాదాపు 1258 మందిని విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించింది. ఆర్ధిక అనిశ్చితి, సెమీకండక్టర్‌ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించినట్టు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్‌లో కొలువుల కోత చేపడతామని క్వాల్‌కాం స్పష్టం చేసింది. శాండియాగో, శాంటా క్లారా ప్లాంట్స్‌లో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే ప్లాంట్ల మూసివేత ఉండబోదని వెల్లడించింది. స్ధూలార్ధిక పరిస్థితుల అనిశ్చితి, డిమాండ్‌ మందగమనంతో ఈ చర్యలు చేపడుతున్నామని, కీలక వృద్ది, వైవిధ్య అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో సంక్లిష్ట నిర్ణయాలు తప్పలేదని కంపెనీ పేర్కొంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :