ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సిఎస్ఐ సనాతన్ అందరినీ అలరిస్తుంది - నిర్మాత అజయ్ శ్రీనివాస్

సిఎస్ఐ సనాతన్ అందరినీ అలరిస్తుంది - నిర్మాత అజయ్ శ్రీనివాస్

మా చాగంటి ప్రొడక్షన్ బ్యానర్ లో మొదటి ఫస్ట్ ప్రాజెక్ట్ గా వస్తోన్న చిత్రం సిఎస్ఐ సనాతన్. ఇది ఓ థ్రిల్లర్ సినిమా. ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ తరహా చిత్రాలను ఇష్టపడుతున్నారు. నేను ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రధాన కారణం ఈ మూవీలో ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ వాళ్లు ఎలా నేర నిర్ధారణ చేస్తారు.. వారి ఇన్వెస్టిగేషన్ ఎంత క్షుణ్నంగా ఉంటుంది అనే పాయింట్ ను దర్శకుడు శివ శంకర్ దేవ్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. థ్రిల్లర్ సినిమాలంటే చాలా వరకూ రీమేక్స్ అనుకుంటారు. కానీ మా సినిమా పూర్తిగా సొంతంగా తయారు చేసుకున్న కథే. ఏ భాషలోని సినిమాకూ రీమేక్, లేదా ఇన్సిస్పిరేషన్ కాదు. ఇక సిఎస్ఐ అంటే ఏంటీ అనే అనుమానం చాలామందిలో ఉంది. సిఎస్ఐ అంటే ‘క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్’అనేది పూర్తి అర్థం. హీరో పేరు సనాతన్ కావడంతో కొత్తగానూ, క్యాచీగానూ ఉంటుందనే ‘సిఎస్ఐ సనాతన్’అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఇక ఫోరెన్సిక్ కు సంబంధించిన రీసెర్చ్ ను కూడా చాలా చేశాం. ఆ తర్వాత కథను పూర్తిగా డెవలప్ చేశాం.

ఇలాంటి సినిమాకు ఆది సాయికుమర్ లాంటి నటుడైతే బాగా ఉంటుందని భావించి.. ఆయన కోసమే చాలాకాలం పాటు ఆగాం. ఆయన ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఈ కథకు బాగా సరిపోతాయి. ఆది సాయికుమార్ కు ఈ మూవీ చాలా పెద్ద విజయం ఇస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. ఇక ప్రధాన తారాగణం అంతా కథానుగుణంగా దర్శకుడికి బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నేను ఎక్కువగా సెలెక్ట్ చేశాను. వాళ్లందరి నుంచి ది బెస్ట్ అవుట్ పుట్ ను దర్శకుడు రాబట్టుకున్నాడు. అలాగే ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ గా అనీష్ సోలోమాన్ ను తీసుకున్నాం. అతని ఆర్ఆర్ ఖచ్చితంగా థియేటర్స్ లో మోగిపోతుందని చెప్పగలను. ప్రతి సీన్ లోని బిజీఎమ్ హాంటింగ్ గా ఉంటుంది.

టైటిల్ సాంగ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. మా డి.వో.పి శేఖర్ ది బెస్ట్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఇక ప్రమోషన్స్ కు సంబంధించి పెద్ద దర్శకులను అప్రోచ్ అవడానికి కారణం మా నాన్నగారు. నేను కూడా దర్శకులతోనే ప్రమోషనల్ యాక్టివిటీస్ తో పాటు ట్రైలర్ విడుదల చేయించాలనుకున్నాను. వాళ్లు కూడా ట్రైలర్ చూసిన తర్వాత చాలా బావుందని థ్రిల్లింగ్ గా ఉందని ప్రశంసలు కురిపించడంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. వాళ్లు చెప్పడమే కాదు ప్రేక్షకులను కూడా సినిమా చూస్తున్నంత సేపూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సీన్ లోనూ థ్రిల్ కు గురి చేస్తుంది. ఫోరెన్సిక్ కు సంబంధించిన సినిమాలకు సిఎస్ఐ సనాతన్ సినిమాకూ ఉన్న తేడా.. ఇందులో క్రైమ్ సీన్ లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఉంటుందనేది డీటెయిల్డ్ గా ఉంటుంది. ఒక కంపెనీ సిఇవో మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడనంత సర్ ప్రైజింగ్ గా ఉంటుంది.

చాలామంది నిర్మాతగా మొదటి చిత్రాన్ని కమర్షియల్ జానర్ ను ఎంచుకుంటారు. కానీ నాకు థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం. ఇలాంటివి ఒన్ టైమ్ వాచబుల్ అయినా కథ, కథనాలపై ఉన్న నమ్మకంతో నేను ఈ జానర్ నే ఎంచుకున్నాను. ఇందులో కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు.. ప్రస్తుతం ఇండియాలో చాలామందిని సర్ ప్రైజ్ చేసిన ఓ పెద్ద స్కామ్ కు సంబంధించిన ఇష్యూ ఉంటుంది. ఈ ఇష్యూతో ప్రతి ప్రేక్షకుడూ కనెక్ట్ అవుతాడు. మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నా.. థ్రిల్లర్ మూవీస్ ఆడియన్స్ ఖచ్చితంగా మా సినిమాను ఆదరిస్తారు అనుకుంటున్నాను. పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు మా హీరో మార్కెట్, ఇమేజ్ ను బట్టి మార్చి 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.

ఆ తర్వాతి వారం నుంచి పోటీ పెరుగుతుంది కాబట్టి ఇది సరైన డేట్ అని నేను అనుకుంటున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది. ఈ సినిమా అవుట్ పుట్ చూసిన తర్వాత ఓ నిర్మాతగా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మా హీరో ఆది సాయికుమార్ గారు నాకు అన్నతో సమానం. మూడేళ్లుగా ఆయనతో పరిచయం ఉంది. ఆయన గత సినిమాల కంటే ముందే మా సినిమా ఒప్పుకున్నారు. పూర్తి చేశారు. అయినా ఓ మంచి డేట్ తో రావాలని కాస్త ఆలస్యం అయినా మార్చి 10న విడుదల చేస్తున్నాం. ఈ మూవీ తర్వాత దీనికి సీక్వెల్ ని ప్లాన్ చేసుకున్నాము. స్టోరీ డెవలప్ అయ్యింది. ఫ్రాంచేజీ చేయాలనే ఆలోచన ఉంది. వేదాంత్ అనే టైటిల్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం.

ఇది కూడా థ్రిల్లర్ తరహాలోనే సాగే చేతబడి, విమెన్ ట్రాఫికింగ్  నేపథ్యంలో ఉంటుంది. మార్చి 10న రాబోతోన్న మా సిఎస్ఐ సనాతన్ చిత్రం మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తూ ప్రేక్షకులందరి సపోర్ట్ ను కోరుకుంటున్నాను. థ్యాంక్యూ.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :